రమ్య హత్య ఘటనపై విచారిస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్ ; టీడీపీ ఫిర్యాదు, రమ్య ఇంటి వద్ద రాజకీయ రగడ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులో పట్టపగలు నడిరోడ్డు మీద ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కేసు రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. దళిత యువతి రమ్యను ప్రేమించటం లేదన్న కోపంతో అత్యంత దారుణంగా కత్తితో పొడిచి ప్రేమోన్మాది హతమార్చిన ఘటనపై విచారణ జరపడానికి జాతీయ ఎస్సీ కమిషన్ ఈరోజు గుంటూరులో పర్యటిస్తోంది. జాతీయ ఎస్సీ కమీషన్ పర్యటన నేపధ్యంలో ఈ రోజు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జాతీయ ఎస్సీ కమీషన్ ను కలిసిన టీడీపీ నేతల బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమ్య హత్య కేసుపై విచారణ జరపడానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని తెలుగుదేశం పార్టీ నేతల బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్ నేతలు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, శ్రావణ్ కుమార్ లు ఎస్సీ కమిషన్ అధికారులను విజయవాడలో కలిశారు. రమ్య హత్య ఘటనతో పాటుగా, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాలను ఎస్సీ కమిషన్ దృష్టికి టిడిపి నేతలు తీసుకువెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై అకృత్యాలు కొనసాగుతున్నాయని వారు కమిషన్ కు చెప్పి, జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీలో తాజా పరిస్థితులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

రమ్య ఇంటికి చేరుకున్న ఎస్సీ కమీషన్ సభ్యులు .. బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
ఇక నేడు గుంటూరులో ఇటీవల దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య ఇంటికి చేరుకున్న ఎస్సీ కమిషన్ సభ్యులు రమ్య హత్య ఘటనపై విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రమ్య ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ను కలవడానికి రమ్య ఇంటి వద్దకు వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరు పట్ల బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను అడ్డుకున్న పోలీసులు జాతీయ ఎస్సీ కమిషన్ వెంట వైసిపి నేతల వాహనాలను పంపించారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

రమ్య ఇంటి వద్ద పోలీసులకు , బీజేపీ నాయకులకు మధ్య తోపులాట.. ఉద్రిక్తత
పోలీసుల తీరు పట్ల బీజేపీ మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులకు మహిళలకు మధ్య పెద్దఎత్తున తోపులాట జరిగింది. బిజెపి మహిళా నాయకురాలు సాధినేని యామిని శర్మ రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుమీద బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో, జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించి ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఈ బృందం నేడు రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి రమ్య హత్యకేసును విచారించనున్నారు.

రమ్య హత్య కేసు నిందితుడికి శిక్ష పడేదాకా .. కొనసాగుతున్న లోకేష్ పోరాటం
ఇదిలా ఉంటే రమ్య హత్య కేసు విషయంలో నారా లోకేష్ జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. పట్టపగలు నడిరోడ్డుపై మీద అత్యంత దారుణంగా దళిత యువతిని హతమార్చిన దుర్మార్గుడి 21 రోజుల్లో శిక్ష వేసి రమ్యకు న్యాయం చేయాలని గత కొద్ది రోజులుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న లోకేష్ జగన్ సర్కార్ కు డెడ్లైన్ విధించారు. 7 రోజుల్లో దర్యాప్తు 14 రోజుల్లో కోర్టు విచారణ 21 రోజుల్లో ఏకంగా ఉరి శిక్ష విధించేలా దిశ చట్టాన్ని రూపొందించామని వైయస్ జగన్ పాలాభిషేకాలు చేయించుకున్నారని గుర్తు చేస్తూ, నేరస్తులకు శిక్ష పడేవరకు విరమించబోమని తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన నేపథ్యంలోనూ ఏపీలో వాతావరణం వేడెక్కింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications