ప్రకాశం జిల్లాలో బాంబు పేలుడు, ఉదయం గుడి వద్ద కలకలం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఆదివార ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నాటు బాంబు పేలిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బచ్చువారిపాలెం గ్రామంలో ఉదయం జరిగింది.
గ్రామంలోని పోలేరమ్మ దేవాలయం వద్ద ఈ ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు బాంబు పేలిన ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా, తెల్లగా ఉన్న ఓ వస్తువు కనిపించింది.

దాన్ని చేతుల్లోకి తీసుకొని పరిశీలిస్తుండగా.. అది పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం చీరాల ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పేలినవి నాటు బాంబులని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.
పోలీసులు బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోలేరమ్మ గుడి వద్ద పెద్ద శబ్దం వినిపించింది. దానిని పరిశీలించేందుకు స్థానిక చికెన్ షాపులో ఉన్న యువకులు ఆదివారం అక్కడకు వెళ్లగా ఇది జరిగిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications