TTD: తిరుమల కొండలకు అంతర్జాతీయ గుర్తింపు - పవిత్రత, ప్రత్యేకత..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఈ నెలలో జరిగే బ్రహ్మోత్సవాల కు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో తిరుమల కొండల సహజ వారసత్వ సంపదకు యునెస్కో రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత మేళవించిన తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి నెలవు. ఇక్కడి తీర్థక్షేత్రాలపై ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు తాజా గుర్తింపు ద్వారా తిరుమల గిరుల వైభవం మరోసారి ప్రస్తావనకు వస్తోంది.
తిరుమల గిరులకు ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని భావిస్తారు. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి శిఖరాల్లో ఒక్కో కొండది ఒక్కో ప్రత్యేకత. అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల కొండల్లో ఒక్కో కొండది ఒక్కో చరిత్ర. 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంత విశేషాల గురించి రాశారు. ఇకజజ ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత మేళవించిన తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి నెలవు. అరుదైన వృక్ష, జంతుజాతులకు ఆలవాలం. ఇక్కడి వాతావరణం కూడా వైవిధ్యం.

తిరుమల కొండలపై నిరంతరం శీతల పవనాలు వీస్తుంటాయి. తరచూ వర్షపు జల్లులు పడుతుంటాయి. అనేక జలపాతాలు కనివిందు చేస్తాయి. ఎందరో రుషులు, మునులు తపస్సునాచరించిన చారిత్రక ఆనవాళ్లు ఇక్క ఉన్నాయి. ఇక్కడి తీర్థక్షేత్రాలపై ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో ఈ గిరులను చేర్చారు. తిరుమల గిరులతో పాటుగా విశాఖ జిల్లాలోని భీమిలి సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలకు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తుది జాబితాలో చోటు దక్కితే ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ మరింత పకడ్బందీగా సాగుతుంది. కొద్ది రోజుల క్రితం భారతీయ సంస్కృతికి అద్దంపట్టే భగవద్గీతతోపాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు లభించింది. అత్యుత్తమ విలువ కలిగిన డాక్యుమెంటరీని సంరక్షించేందుకు ఇది దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications