పోలవరం ప్రాజెక్టుపై కీలక అడుగు: గడ్కరీ కీలక నిర్ణయం, నవయుగ చేతికి పోలవరం

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులో కీలక ముందడుగు. ఈ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వద్ద మంగళవారం భేటీ జరిగింది. ప్రాజెక్టులో స్పిల్ వే కాంక్రీటు, స్పిల్ వే ఛానల్ పనులకు కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించే అంశంపై స్పష్టత వచ్చింది.

దీనిపై రెండు గంటల పాటు కేంద్ర జల వనరుల శాఖ, జలసంఘం అధికారులతో భేటీ అనంతరం మంత్రి కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. నవయుగ, ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్టు సంస్థల్లో వేటికి ఈ పనులు అప్పగించాలనే చర్చ జరిగింది.

Navayuga to take up Polavaram works

పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ ఇప్పటి వరకు అనుకున్నట్లుగా నిర్దిష్ట సమయంలో పనులు పూర్తి చేయలేదు. దీంతో పనులను నవయుగకు అప్పగించాలని నిర్ణయించారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో 2019 నాటికి పాత ధరలతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నవయుగతో అంగీకారం కుదిరింది.

నవయుగ కంపెనీకి స్పిల్‌వే, ఛానల్‌ పనుల్ని పూర్తిచేసేందుకు నిర్ణీత గడువును ఇవ్వడంతో పాటు అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకొనేందుకు అవగాహన ఒప్పందం కుదరనుంది. దీనిప్రకారం స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌ పనుల్ని నవయుగ త్వరలో చేపట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+