జగన్ ఎందుకులా చేస్తున్నారు - అమరావతి పై శరద్‌పవార్ : కేంద్ర మంత్రులు సైతం..!!
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులేమిటి..సీఎం జగన్ అలా ఎందుకు చేస్తున్నారంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో ఈ బృందం శరద్‌పవార్‌ను కలిసి తమ సమస్యను ఏకరువుపెట్టినప్పుడు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోనూ రెండు రాజధానులున్నాయని, వాటిలో ఒకటి విదర్భలో ఉన్నా ఆ ప్రాంతం ఏమీ అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కంటే చిన్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏంటని పవార్ ప్రశ్నించారు. ఇదే సమయంలో పవర్ ఏపీలో ఆర్దిక పరిస్థితిని ప్రస్తావించారు.

ఆర్దిక పరిస్థితులు - మూడు రాజధానులు
రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పైన అనేక వార్తలు వస్తున్నాయని.. వాస్తవం ఏంటంటూ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. చేశారు.తాము హైకోర్టుకు వెళ్లామని.. కోర్టు సైతం అమరావతే రాజధాని అని, సీఆర్డీఏ ప్రకారం రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చిందని వారు శరద్‌పవార్‌కు వివరించారు. కోర్టు తీర్పు పైన సీఎం స్పందన ఏంటని పవర్ అడిగి తెలుసుకున్నారు. అమరావతి పైన బీజేపీ వైఖరి ఏంటనే అంశం పైన పవార్ ఆరా తీసారు. రాజధానికి మద్దతు తెలుపుతున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం సరైన మద్దతు లభించడం లేదని రైతులు ఆయనకు వివరించారు. దీంతో.. పార్లమెంట్‌లో అమరావతికి తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఆయన్ను కలిసిన నేతలు వెల్లడించారు.

కేంద్ర మంత్రులతోనూ వరుస భేటీలు
అమరావతి రైతులు ఆ తరువాత ద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నారాయణ్ రాణే, నరేంద్ర సింగ్ తోమర్, అశ్వనీ వైష్ణవ్‌ను కలిసి నిర్మాణాలకు నిధుల కేటాయింపులపై వినతులు అందించారు. అమరావతి లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల నిర్మాణాల పైన వారిని అభ్యర్ధించారు. అందించారు.అమరావతిలో సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థను త్వరగా ఏర్పాటు చేయాలని నారాయణ్ రాణేను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని రైతులు చెప్పారు. ఆర్థిక శాఖకు సంబంధించి 17 నుంచి 20సంస్థల భవనాలు నిర్మించాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌కు రైతులు విన్నవించారు.

అమరావతి రైతులకు హామీ
ఆయా భవనాలపై అధ్యయనం చేసి.. అన్ని విభాగాలకు లేఖలు రాస్తానని నిర్మల వారికి హామీ ఇచ్చారు. అదే విధంగా రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కలిసి మంగళగిరి రైల్వే స్టేషన్‌తో పాటు, కృష్ణాకెనాల్ జంక్షన్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుగా అభివృద్ధిగా చేయాలని కోరారు. ఆ సమయంలో ఆయన తెలుగులో రైతులను పలకరించారు. రైతుల అభ్యర్ధన పైన సానుకూలత వ్యక్తం చేసారు. ఈ రోజు మరి కొందరు కేంద్ర మంత్రులు...హోం మంత్రి అమిత్ షా తోనూ సమావేశం అయ్యేందుకు అమరావతి రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications