మళ్ళీ నిరాశే, పాతపాటే పాడిన జైట్లీ: రూ.3973 కోట్లిచ్చాం, పోలవరానికి నిధులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపుల విషయమై ఏపీకి చెందిన ఎంపీల నిరసనల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి శుక్రవారం రాత్రి మరోసారి ప్రకటన చేశారు.ఏపీకి చెందిన ఎంపీలు చేస్తున్న డిమాండ్ల విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ప్రకటనలో స్పష్టత లేదనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన కొన్ని అంశాలు ఈ ఏడాది ప్రారంభం కానున్నట్టు జైట్లీ ప్రకటించారు.లోక్‌సభలో చెప్పిన విషయాలను జైట్లీ మరోసారి చెప్పారు.

రంగంలోకి సుజనా: పార్లమెంట్‌లో జైట్లీ ప్రకటన చేసే అవకాశం?

ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ప్రకటనపై ఎంపీలు ఆశగా ఎదురు చూశారు.

అంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలు

జైట్లీ రాజ్యసభలో ప్రకటన చేయడానికి ముందుగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు జైట్లీతో చర్చించారు. ఏపీకి న్యాయం జరిగేలా జైట్లీ ప్రకటన ఉంటుందని భావించిన నేతలకు లోక్‌సభలో ప్రస్తావించిన అంశాలనే జైట్లీ మరోసారి చెప్పి చేతులు దులుపుకొన్నారు.

పాత పాటే పాడిన జైట్లీ

పాత పాటే పాడిన జైట్లీ

ఏపీకి బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయమై ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే రాజ్యసభలో జైట్లీ ప్రసంగంలో ఏపీకి న్యాయం చేస్తారని ఎంపీలు ఆశించారు. కానీ, లోక్‌సభలో ఏ అంశాలను ప్రస్తావించారో అదే అంశాలను జైట్లీ మరోసారి రాజ్యసభలో కూడ శుక్రవారం రాత్రి ప్రస్తావించారు.పాత విషయాలను మరోసారి చెప్పారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చాం

రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చిన విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను ఇచ్చిన విషయాన్ని జైట్లీ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిరంతరం నిదులను కేటాయిస్తామని జైట్లీ గుర్తు చేశారు.

ఏపీకి న్యాయం కోసం పోరాటం చేశాం

ఏపీకి న్యాయం కోసం పోరాటం చేశాం

రాష్ట్ర విభజన విషయంలో ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని తాము కూడ డిమాండ్ చేసిన విషయాన్ని అరుణ్ జైట్లీ గుర్తు చేశారు. కేంద్ర విద్యాసంస్థలను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే కొన్ని సంస్థలను ఇచ్చామని, మరికొన్ని సంస్థలను ఈ ఏడాది ప్రారంభిస్తామని జైట్లీ ప్రకటించారు.

రెవిన్యూ లోటు కింద రూ.3973 కోట్లిచ్చాం

రెవిన్యూ లోటు కింద రూ.3973 కోట్లిచ్చాం

కేంద్ర ప్రభుత్వం తొలి ఏడాదే ఏపీ రాష్ట్రానికి రెవిన్యూ లోటు కింద రూ.3973 కోట్లను ఇచ్చిందని అరుణ్ జైట్లీ ప్రకటించారు. దుగరాజుపట్నం పోర్టు, పెట్రో కారిడార్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాట విషయమై చర్యలు తీసుకోవాలని జైట్లీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union finace minister Arun jaitley said that Rs.3973 crores released to Ap state for the first financial year. NDA government committed to fulfill its promises to AP .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి