టీడీపీ - బీజేపీ సీట్ల మార్పు పై కూటమి నేతల కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమిలో కొన్ని సీట్లు..అభ్యర్దుల మార్పు వ్యవహారం పైన చర్చ జరుగుతోంది. తాజాగా చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్, పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ లతో సమావేశం జరిగింది. సీట్ల సర్దుబాటు పైన సూత్రప్రాయంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ నెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండటంతో కలిసి ప్రచారం పైన కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

సీట్ల సర్దుబాటు
ఏపీ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై ఎన్డీయే కూటమి దృష్టిసారించింది. చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీట్ల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అనపర్తి, ఉండి స్థానాల్లో కొనసాగుతున్న పరిణామాల పైన ఈ భేటీలో చర్చించారు. అనపర్తి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధం చేసిన బీజేపీ నేతలు..రెండు ప్రత్యామ్నాయాలు సూచించారు. అనపర్తి టీడీపీకి ఇవ్వాలంటే తమకు తంబళ్లపల్లె లేదా ఏలూరు లేదా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఓ స్థానం కేటాయించాలని కోరినట్లు సమాచారం.

NDA leaders key dicssions over Election campaign and seats changes in some Districts

సమన్వయం ఉండేలా
అదే సమయంలో క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపంపైనా బీజేపీ నేతలు ప్రస్తావించారు. వెంటనే సరి చేసుకోవాల్సిన అవసరం గురించి సూచన చేసారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వనుండటంతో వీలైనన్ని ఎక్కువ సభల్లో మూడు పార్టీల నేతలు పాల్గొనేలా ప్లాన్ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రచారంతో పాటు, సీట్ల సర్దుబాటు వ్యవహారంపై నేతలు చర్చించారు. ఉమ్మడిగా నిర్వహించే సభలకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల సమీపిస్తుండడంతో ప్రచారానికి పలువురు స్టార్ క్యాంపెయినర్లను కూడా ఎన్డీయే కూటమి ఎంపిక చేసింది.

ప్రచారానికి రోడ్ మ్యాప్
ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ లెవల్, అసెంబ్లీ లెవల్ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు, వ్యూహాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఖరారు చేశారు. ఇక సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. ఓట్ల బదిలీపై క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపైనా నిర్ణయాలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+