Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ఆ ముగ్గురి ఎంపిక వెనుక - చివరి నిమిషంలో..!!

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారయ్యారు. అయిదు స్థానాల్లో టీడీపీ మూడు స్థానాలకు పోటీ చేస్తోంది. జనసేనకు ఒక సీటు దక్కింది. అనూహ్యంగా బీజేపీ చివరి నిమిషంలో తమ స్థానం దక్కించుకుంది. టీడీపీ నుంచి మూడు స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారు. ఒకటి ఎస్సీ, రెండు బీసీలకు కేటాయించారు. సీట్లు ఆశించిన పలువురు సీనియర్లకు అవకాశం దక్కలేదు. ఆశావాహులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఫోన్ చేసి బుజ్జగించారు. అయితే, ఈ మూడు స్థానాల ఎంపిక వెనుక ఆసక్తి కర సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.

చంద్రబాబు ఎంపిక
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయిదు స్థానాలు కూటమికే దక్కుతున్నాయి. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసారు. మిగిలిన నాలుగు స్థానాలు టీడీపీకే దక్కు తాయని భావించారు. బీజేపీకి తాజాగా సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీటు ఇవ్వనుండటం తో ఎమ్మెల్సీ స్థానం అవకాశం ఉండదని టీడీపీ నేతలు అంచనా వేసారు. చివరి నిమిషంలో బీజేపీ నేతలు ఒత్తిడి పెంచి సీటు సాధించారు. దీంతో, టీడీపీకి మూడు స్థానాలే దక్కాయి. 2024 ఎన్నిక ల సమయంలో పలువురు కూటమి అభ్యర్ధుల కోసం తమ సీట్లు త్యాగం చేసారు. వారికి అవకాశం దక్కుతుందని చివరి నిమిషం వరకు భావించారు. అయితే, చంద్రబాబు ముగ్గురు అభ్యర్ధులను సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసారు.

NDA MLC Candidates to file nomination today in MLA quota as three parties decision

తొడ గొట్టి సవాల్ చేసిన గ్రీష్మ
టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా కావలి గ్రీష్మ, బీదా రవిచంద్రతోపాటు బీటీ నాయుడు పేర్లను ఖరారు చేసారు. కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ దక్కటం వెనుక మహానాడు వేదికగా తొడ కొట్టి వైసీపీ నేతలకు సవాల్ చేసిన అంశం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. గ్రీష్మ ఇప్పటికే మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్​ గా.. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ యువనేతగా గ్రీష్మకు పార్టీలో గుర్తింపు వచ్చింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ కుమార్తె కావలి గ్రీష్మ అనూహ్యంగా ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు.పార్టీలో మొదటి నుంచీ ఉంటూ అంటిపెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది.

Take a Poll

బీదా - నాయుడు ఎంపిక వెనుక
ఎన్నికల సమయంలో పార్టీ సమన్వయకర్తగా బీదా రవిచంద్ర కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో సీటు ఆశించినా దక్కలేదు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న వారిలో యనమలకు ఛాన్స్ లేకపోవటంతో అదే సామాజిక వర్గానికి చెందిన బీదా రవిచంద్ర వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. ఇక, కర్నూలు జిల్లా కు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో న్యాయవాది అయిన బీటీ నాయుడు నిత్యం చంద్రబాబు - పార్టీ మధ్య వారధి గా వ్యవహరించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో అందించిన సేవలు.. ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు మండలిలో లేకపోవటంతో బీటీ నాయుడుకు అవకాశం దక్కింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+