ఏపీలో అధికారం వారిదే.. కేంద్రానికి నివేదిక

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మే 13వ తేదీన ఒకే విడతలో జరగనున్నాయి. జూన్ నాలుగోతేదీన ఫలితాలు విడుదలవుతాయి. అన్ని పార్టీలు ఎన్నికల చదరంగంలో హోరాహోరీగా పావులు కదుపుతున్నాయి. జనసేన, బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే విషయమై తమకు స్పష్టత ఉందని, స్పష్టమైన సమాచారం కూడా ఉందన్నారు.

నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని, కేంద్రానికి సమాచారం ఉందని తెలిపారు. 145 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించబోతున్నారని, 23 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తున్నట్లు వెల్లడించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీచేస్తున్నాయి.

nda winning in ap elections said that sunil bansal

ఏపీ ఎన్నికలకు సంబంధించి చాలా సర్వేలు వచ్చాయి. 11 సర్వేల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని తేలింది. జూన్ నాలుగున ఫలితాలు వస్తాయని, తొమ్మిదిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బన్సల్ తేల్చి చెప్పారు. అమిత్ షాకు వీరవిధేయుడులాంటి బన్సల్ ఏపీలో కూటమిదే అధికారం అని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదికల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 సీట్లకే పరిమితమవుతుందని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సర్వేలు స్పష్టమైన ఫలితాలను వెల్లడించడం, కేంద్ర ప్రభుత్వానికి కూడా అవే నివేదికలు అందడంతో వైసీపీకి ఓటమి తప్పదని తెలుస్తోంది. ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+