ఎన్డీటివి: సైకిల్‌పై ఫ్యాన్‌దే పైచేయి, టీలో కారు జోరు

తెలంగాణలో కారు జోరు కొనసాగవచ్చని అంచనా వేసింది. బుధవారం ఆ చానల్ తన ఎగ్జిట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. దీని ప్రకారం సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 80-100 సీట్లు, తెలుగుదేశం - బిజెపి కూటమికి 75-95 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 5 నుంచి 15 స్థానాలు గెలుచుకోవచ్చు.
లోకసభ స్థానాల విషయానికి వస్తే తెలుగుదేశం 13 స్థానాలను గెలుచుకుంటుందని, వైయస్సార్ కాంగ్రెసు 12 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇరు పార్టీలు 45 శాతం ఓట్లతో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయని వివరించింది. రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్రలో కాంగ్రెస్ మట్టికొట్టుకు పోయిందని తేల్చింది.
తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం హవా కొనసాగుతుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. తెలంగాణలోని 17 లోకసభ సీట్లలో 11స్థానాలను కైవసం చేసుకోవచ్చని, కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోవచ్చని ఎగ్జిట్ పోల్ సర్వే పేర్కొంది. తెలుగుదేశం - బిజెపి కూటమి 2 స్థానాలను, ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకుంటాయని అంచనా. తెలంగాణలో టీఆర్ఎస్‌కు 40 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా టిడిపి, కాంగ్రెస్‌లకు చెరో 23 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
కేంద్రంలో ఎన్డీయేకు ఎదురులేదని చెప్పింది. 279 స్థానాలతో అధికారం కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది. ఎన్డీయే కూటమికి 279 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ముఖ్యంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 56 స్థానాలు రావచ్చునని చెప్పింది. బీజేపీ సొంతంగా 235 స్థానాలు కైవసం చేసుకుంటుంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 103 స్థానాలకు పరిమితమవుతుందని, కాంగ్రెస్‌కు సొంతంగా 79 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications