Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇఫ్కో కిసాన్ ప్రత్యేక ఆర్థిక మండలికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కలెక్టర్ ఏమన్నారంటే ??

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఇఫ్కో కిసాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (IFFCO Kisan SEZ) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన పట్ల జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల హర్షం వ్యక్తం చేశారు. రాచర్లపాడు గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. దీంతో నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో నూతన అధ్యాయం ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు.

కాగా IFFCO Kisan SEZ Ltd సంస్థ నెల్లూరు జిల్లాలో సుమారు 2,776 ఎకరాల విస్తీర్ణంలో మల్టీ-ప్రొడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.870 కోట్ల పెట్టుబడులతో రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ, లాజిస్టిక్స్ వంటి ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక ఆర్థిక మండలి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 30 వేల మందికి, పరోక్షంగా మరో 40 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కలెక్టర్ వెల్లడించారు. మొత్తం కలిపి సుమారు 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.

nellore-district-collector-himanshu-shukla-about-iffco-kisan-sez

అంతే కాకుండా అదనంగా భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు, యూనిట్లు ఏర్పాటు చేస్.. సుమారు 29,400 మందికి అదనపు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని, ఇప్పటికే మూడు ప్రధాన పరిశ్రమలు ఇక్కడ యూనిట్లు స్థాపించేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇంకా పలువురు పారిశ్రామికవేత్తలు ఈ SEZలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. దీంతో రాబోయే కాలంలో పరిశ్రమల స్థాపన మరింత వేగవంతం కానుంది.

ఈ SEZ నెలకొనడం వల్ల ముఖ్యంగా MSME మరియు SME రంగాలకు విస్తృత అవకాశాలు లభించనున్నాయని, ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి, చిన్న వ్యాపారులకు వ్యాపార అవకాశాలు, జిల్లాకు ఆర్థిక చైతన్యం వంటి బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత ఈ ఇఫ్కో కిసాన్ ప్రత్యేక ఆర్థిక మండలి కావలి-నెల్లూరు మధ్య కీలక ఆర్థిక కారిడార్‌గా మారుతుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+