వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అతని' కనుసైగ... 3 మండలాలకు శాసనం.. TDP, YCPలో ఎవరివైపు?

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వీడిపోవాలని ఆనం రామనారాయణరెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన తన సన్నిహితులు మెట్టుకూరు ధనుంజయరెడ్డి, చెన్ను బాలకృష్ణారెడ్డితో రాపూరు మండలంలో సమావేశమయ్యారు. విలువ లేనిచోట ఎక్కువ రోజులు ఉండదలుచుకోలేదని, బయటకు వెళ్లిపోతున్నానని చెబుతూ తర్వాత కూడా వారి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన నేదురుమల్లి

రంగంలోకి దిగిన నేదురుమల్లి

ఈ విషయం తెలిసిన వెంటనే తర్వాత రోజు ఉదయం వెంకటగిరి వైసీపీ ఇన్ ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డిని వెంట పెట్టుకొని పాపకన్ను మధురెడ్డిని కలిశారు. ఆనం రామనారాయణరెడ్డితోపాట నాయకులు కూడా వెళ్లకుండా ఉండేందుకు మధురెడ్డిని కలిశారు. పాపకన్ను కుటుంబం రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లో ఎంత చెబితే అంత. ఆ కుటుంబం ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీనే గెలుస్తుంది. ఆనం కుటుంబానికి 20 సంవత్సరాల నుంచి వ్యతిరేకంగా ఉంటున్న మధురెడ్డి గత ఎన్నికల్లో రామనారాయణరెడ్డికి మద్దతివ్వడంతో సులువుగా విజయం సాధించారు.

వెంకటగిరి, ఆత్మకూరులో ఒప్పందాలు

వెంకటగిరి, ఆత్మకూరులో ఒప్పందాలు


పాపకన్ను మధురెడ్డి కుటుంబానికి చెందిన ఆడబిడ్డను మేకపాటి రాజమోహన్ రెడ్డి వివాహం చేసుకున్నారు. వెంకటగిరి నుంచి ఆనం పోటీకి నిర్ణయించుకున్న సమయంలో మేకపాటి కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తన గెలుపునకు పాపకన్ను కుటుంబం సహకరిస్తే గౌతమ్ రెడ్డి విజయానికి ఆత్మకూరులో తనవర్గం పూర్తి మద్దతిస్తుందనేది ఒప్పందం సారాంశం. తన వెంట ఉన్న నాయకులతో ఆనం రామనారాయణరెడ్డి ఆంతరంగికంగా చర్చిస్తుండటంతో పాపకన్ను చేజారిపోకుండా చూసేందుకు నేదురుమల్లి రంగంలోకి దిగారు.

ఇంతకీ పాపకన్ను మధురెడ్డి ఎటువైపు?

ఇంతకీ పాపకన్ను మధురెడ్డి ఎటువైపు?

మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డిలను వెంటబెట్టుకుని పాపకన్ను మధుసూదన్‌రెడ్డితో రాంకుమార్‌ భేటీ అయ్యారు. మామిడితోపులో వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. మధురెడ్డికి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల బాధ్యత అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాపకన్ను మధురెడ్డి ఇప్పటికీ ఆనంతోనే ఉన్నారు. వీరి మధ్య చర్చల తర్వాత మధురెడ్డి ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరివైపు మొగ్గుచూపితే వారు విజయం సాధిస్తారనేది ఇక్కడి సెంటిమెంట్. ఈసారి ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ బ్రేకవుతుందా? లేదంటే అదే కొనసాగుతుందా? అనేది తేలాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేంతవరకు ఎదురుచూడక తప్పదు.

English summary
It seems that Anam Ramanaraya Reddy has decided to leave the leadership of the YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X