జగన్‌కు గట్టి షాక్: నెల్లూరు జిల్లా కీలక నేత రాజీనామా, టిడిపిలోకి
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మరో సీనియర్ నేత ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి సీనియర్ నేత.
ఆయన సోమవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన ఆశయాలకు తగ్గట్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇప్పటికే వైసిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరో ఇద్దరు ముంగుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతలు కూడా జగన్‌కు దూరం జరుగుతుండటం గమనార్హం.
కర్నూలు జిల్లా వైసిపి అధ్యక్షులు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇప్పటికే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లా అద్దంకి వైసిపి ఎమ్మెలే గొట్టిపాటి రవికుమార్ కూడా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.
గొట్టిపాటి ఇప్పటికే అయిదు రోజుల నుంచి నియోజకవర్గ పరిధిలోని మండలాలు, గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.
త్వరలో టిడిపిలో చేరే తేదీ, వేదిక కూడా ఖరారు చేయనున్నారు. రవి, శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ ఇద్దరూ ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మంచి రోజు చూసుకుని పార్టీ మారే ఆలోచనలో గొట్టిపాటి ఉన్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications