నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి గెలుపు

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టిడిపి విజయం సాధించింది. టిడిపి అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి తన సమీప వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు.కర్నూల్ లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, కడపలో వైఎస్ వివేకానందరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టిడిపి అభ్యర్థి తన వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించి వైసిపి ఆధిపత్యానికి గండికొట్టారు. నెల్లూరు జిల్లాలో టిడిపిని దెబ్బతీసేందుకుగాను ఆనం విజయ్ కుమార్ రెడ్డిని వైసిపి బరిలోకి దింపింది అయితే టిడిపి అభ్యర్థి మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.

mlc election result

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార, విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి.

నెల్లూరు జిల్లాలో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన వాకాటి నారాయణరెడ్డికి 465 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్తిగా బరిలోకి దిగిన ఆనం విజయ్ కుమార్ రెడ్డికి 378 ఓట్లు వచ్చాయి. 87 ఓట్ల తేడాతో ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై టిడిపి అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
nellore tdp candidate vakati narayana reddy won in local bodies mlc elections
Please Wait while comments are loading...