చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్షలా..? ఏ సనాతన ధర్మం చెప్పింది బాసూ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. అయితే ఆయన గతంలో పలు సందర్భాల్లో చేసిన పనులకు , ఇప్పుడు మాట్లాడే మాటలకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Christian pawan kalyan doing varahi deeksha and wearing chappal. Clearly he is mocking our dharma pic.twitter.com/wmdOI62M61
— AlluArjunAbhimani (@AlluArjunAbhim6) September 20, 2024
పద్ధతిగా నుదుట బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించి పవన్ అందర్ని ఆకట్టుకున్నారు అయితే వారాహి అమ్మవారి దీక్ష చేస్తోన్న పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి కనిపించారు. పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించ పరచడమనే అభిప్రాయం అప్పట్లోనే వ్యక్తం అయింది. ఎన్నికల సమయంలో హిందూమతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కల్యాణ్‌కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనం పవన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కూడా పవన్ కల్యాణ్ దీక్షలు చేసినప్పుడు చెప్పులు ధరించారు. ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వరస్వామి ఫొటోను చెప్పులు వేసుకునే అందుకున్న వీడియో అప్పట్లో బాగానే వైరల్ అయింది. ఎన్నికల సమయంలో ముస్లిం సోదరులతో భేటీ అయిన సమయంలో పవన్ వారికి అనుకూలంగా మాట్లాడిన వీడియోలు సైతం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వారి ఆహార అలవాట్ల గురించి పవన్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు మాత్రం సనాతన ధర్మం అంటూ వేదాలు వల్లిస్తున్నారంటూ నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. బీజేపీని మెప్పించడానికే పవన్ ఇలా సనతన ధర్మం గురించి చెబుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
In varahi deeksha wearing slippers such a shameless act @PawanKalyan and his kiddo fans started calling him sanathani recently 😂
— M I B ™ (@MassIconBunny) September 20, 2024
Hurting the sentiments of Hindus by chanting such a powerful and divine mantra with slippers shameless 🙏
#TirupatiLaddu https://t.co/bLJ2ZyWHMV pic.twitter.com/zwJ5Jz19rS












Click it and Unblock the Notifications