కిస్తీ కట్టలేక కారు అమ్మేసిన పవన్...మరి ఇంత ఇల్లు ఎలా?...నెటిజన్ల సందేహం

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి:మాటలకు చేతలకు పొంతనలేకపోవడమనేది రాజకీయనేతల విషయంలో సర్వసాధారణమే...అయితే సినీ నటుల విషయంలో కూడా ఇంతేనా?...వాళ్లు కూడా అలాగే ఉంటారా?...కాకపోతే వాళ్లు జనజీవన స్రవంతిలో ఉండరు కాబట్టి ఆ విషయం తెలియలేదా?...లేక రాజకీయ రంగప్రవేశం చేయడంతోనే వారికీ ఆ విద్య అలా వచ్చేస్తోందా?...ఇప్పుడు ఈ డౌట్లన్నీదేనికంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనల గురించే...

పవన్ ఇటీవలి కాలంలో మాటలకు చేతలకు అసలు పొంతన లేకపోవడం...ఆ విషయం స్పష్టంగా బైటపడిపోతుండటం అతని విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీస్తోంది...పవన్ ఆ మధ్యన మాట్లాడుతూ తాను ఈఎంఐ కట్టలేక కారు కూడా అమ్మేశానని చెప్పిన విషయం గుర్తుండే వుంటుంది.

దీంతో సినిమాల ఫ్లాప్ కారణంగా దారుణంగా దెబ్బతిన్నాడు కాబోలని జనం కూడా ఆ మాటలు నమ్మారు...సింపతీ చూపారు...అయితే ఆ తరువాత అనతికాలంలోనే పవన్ నూతన రాజధాని ప్రైమ్ ఏరియాలో అతి విశాలమైన స్థలంలో భారీ భవంతిని కట్టబోతుండటం అతని ప్రకటనలపై సందేహాలకు తావిచ్చాయి...దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇప్పుడు పవన్ పై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు...అవేమిటంటే?...

నెటిజన్లు అడుగుతున్న ఆ ప్రశ్న...ఏంటంటే?...

నెటిజన్లు అడుగుతున్న ఆ ప్రశ్న...ఏంటంటే?...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ మధ్య కాలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నారు...ఆఖరికి ఈఎంఐ కట్టలేక కారు అమ్మేశానని చెప్పి బాధపడ్డారు...మరి ఇంత తక్కువ కాలవ్యవధిలోనే నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో అంత పెద్ద ఇల్లు ఎలా కడుతున్నారు?...ఈ విషయం మాకు అర్థం కాలేదు...మార్చి14 జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అనేక అంశాల గురించి క్లారిటీ ఇస్తానన్న మీరు కాస్త ఈ విషయం గురించి కూడా స్పష్టత ఇవ్వమని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.

 ఈ మధ్య కాలంలో ఏం జరిగింది?....ఎలా?...

ఈ మధ్య కాలంలో ఏం జరిగింది?....ఎలా?...

తమరు ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పి బాధపడిన సందర్భంలో మా గుండె తరుక్కుపోయిందని...మీరు పెద్ద హిట్లు కొట్టి ఆ ఇబ్బందుల నుంచి బైటపడాలని కోరుకున్నామని...కానీ ఆ తరువాత సర్థార్...కాటమరాయుడు...అజ్ఞాతవాసి లాంటి మేజర్ డిజాస్టర్స్ తో మీ ఆర్థిక పరిస్థితి ఇంకెంత దారుణంగా తయారైందోనని ఎంతో ఆందోళన చెందామని...కానీ మీ గురించి మా చింత అనవసరమని...మీరు ఆర్థికంగా బాగా కోలుకున్నారని ఇటీవలి కాలంలో మీ మాటలు... చేతల ద్వారా అర్ధమయింది. అందుకు మాకు హ్యాపీగానే ఉన్నా...కొత్త డౌట్లు మొదలయ్యాయి...ఇదేలా సాధ్యమైందని?...

ఎలా సాధ్యం...నెటిజన్ల సందేహం!

ఎలా సాధ్యం...నెటిజన్ల సందేహం!

ఇటీవలి కాలంలో మీరు మాట్లాడుతున్న మాటలకు...చేతలకు అస్సలు మ్యాచ్ కావడం లేదు...నామీద కక్ష్య కట్టి ఇన్ కం ట్యాక్స్ వాళ్లతో దాడి చేయించారని చెప్పలేక చెప్పి బాధపడ్డారు...అసలు ఇన్ కం ఏ లేని మీ మీద ఐటి వాళ్లు దాడి చెయ్యడమేంటి?...అంటే వాళ్లకు కూడా మీరు చెప్పే మాటల్లో నిజం లేదని...అసలు వాస్తవం వేరని ఏమైనా ఉప్పందిందా?...లేకపోతే అసలు ఎంతో ఇన్ కం ఉన్న వాళ్ల మీదే వాళ్లు రైడింగ్ లు చెయ్యరు...అలాంటిది మీ మీద..దాడులు...సరే...కక్ష్య పూరింతగానే చేశారని నమ్మాము...కానీ కొందరు మీడియా వాళ్లు మీ ఆస్తుల గురించి ప్రకటించమంటే...అలా దాటేశారేంటి?...అదంతా ఐటి వాళ్లు చూసుకుంటారు...నేను అన్నీ సరిగ్గానే కడుతుంటాను అన్నారు...ఇదేంటిది?...వర్షన్ మారిందే...ఏమీ లేకపోతే చెప్పెయ్యొచ్చు కదా?..అందులోనూ ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు చెప్పడానికి ఏం ఇబ్బంది ఉంటుంది...

ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు అన్నారు...

ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు అన్నారు...

ఖాజా టోల్ గేట్‌కి స‌మీపంలో జాతీయ ర‌హ‌దారికి ద‌గ్గ‌ర్లో ప‌వ‌న్‌ కళ్యాణ్ తాను ఇటీవ‌ల కొనుగోలు చేసిన రెండెక‌రాల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించేందుకు గాను సోమ‌వారం ఉద‌యం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి పునాదిరాయి వేయడం...ఆ తరువాత జనసేన కార్యాల‌యానికి భూమి పూజ చేయడం తెలిసిందే....ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు అన్నారు...ఇక్కడ మీ పెళ్లి సంగతి...లేదా..పెళ్లిళ్ల సంగతి అడగడం లేదు...కానీ...ఇల్లు విషయమే క్లారిటీ కోరుతున్నాం...ఐటి రిటన్లు...జనాలకు అనవసరం...ఐటివాళ్లు చూసుకుంటారు...అన్నారు...మరి అన్ని ఇబందుల్లో ఉంటూ ఇంత భారీ వ్యయం అయ్యే ఇల్లు ఎలా కట్టగలుగుతున్నారు...రెండెకరాల స్ధలంలో మీరు కట్టాలనుకున్న ఇల్లు...పార్టీ ఆఫీసు ఎంత లేదనుకున్నా 25...30 కోట్లు అవుతాయని అంటున్నారు. కొంతకాలం క్రితమే కారు ఈఎంఐ కట్టలేని వ్యక్తికి ఇన్ని కోట్లు...వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిన నేపథ్యంలో కూడా ఇంత ఆదాయం ఎలా వచ్చిందో?...అది కూడా బహిరంగ సభలో ప్రజలకు వెల్లడిచ్చేస్తే పారదర్శకంగా ఉంటుందని...లేదంటే విశ్వసనీయత దెబ్బతింటుందని నెటిజన్లే సలహా ఇస్తున్నారు...మరి పవన్ ఏం చేస్తాడో మరో రోజు ఆగితే తేలిపోతుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur:Many of the questions are posed by netizens in social media on the house that Pawan Kalyan is building in AP Capital area.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి