జనసేన సభ తరువాత ఆ పదం ట్రెండ్ అవుతోంది: ఇదేం లాజిక్కో మరి
Pawan Kalyan: జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి- భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది.
రాష్ట్ర, జాతీయ అంశాలపై తన ఉద్దేశమేంటో కుండబద్దలు కొట్టేశారు పవన్ కల్యాణ్.. ఈ సభ ద్వారా. తమిళనాడు రాజకీయాలపైనా వ్యాఖ్యలు చేశారు. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని తప్పుపట్టారు. హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందనీ తేల్చి చెప్పారు.

హిందీ సినిమాల డబ్బింగ్‌తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ.. హిందీని మాట్లాడకూడదా? అంటూ సూటిగా ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. హిందీని వ్యతిరేకిస్తోన్న వాళ్లు కూడా తమ సినిమాలను ఆ భాషలోకి డబ్ చేసుకోంటోన్నారంటూ చురకలు అంటించారు. ఇదేం లాజిక్కో అర్థం కావట్లేదని అన్నారు.
భారత్‌లో లింగ్విస్టిక్ డైవర్సిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఎన్ని భాషలను నేర్చుకుంటే అంత మెరుగుపడతామనీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదనీ ఆయన స్పష్టం చేశారు.
Huge competition for chameleon by @PawanKalyan https://t.co/a4a1oi4GtC pic.twitter.com/hrOjy3rgCX
— Amitaab Chachchan (@DiceGameMaster) March 15, 2025
ఇది- పవన్ కల్యాణ్‌పై విమర్శల దాడికి తెర తీసినట్టయింది. గతంలో ఇదే పవన్ కల్యాణ్ హిందీ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలు, ట్వీట్లు, దినపత్రిక క్లిప్పింగ్‌ను సోషల్ మీడియా యూజర్లు తవ్వి తీశారు. వాటిని ట్రెండ్ చేస్తోన్నారు. Chameleon అనే ట్యాగ్‌ను జోడిస్తోన్నారు. ఫలితంగా ఈ పదం ట్రెండింగ్ అవుతోంది.
దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విమర్శించిన సందర్భాలను నెటిజన్లు గుర్తు చేస్తోన్నారు. గతంలో తెలుగేతర సీనియర్ ఐఎఎస్ అధికారిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా అపాయింట్ చేసినప్పుడూ ఆయన తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తోన్నారు.
Pawan Kalyan 🤡 changing his colours faster than chameleon
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) March 15, 2025
Once He was fighting against North Politicians and seeking justice for South states.
Now he is batting for North Politicians 🤦🏻♂️pic.twitter.com/V52F60gTn3












Click it and Unblock the Notifications