Kathi Maheshకు ఆర్థిక సాయమా..ఎవరి సొత్తని : వైసీపీ ఎమ్మెల్యే అసహనంతో అగ్గి: రచ్చ రచ్చ..!!

సినీ క్రిటిక్...వివాదాలకు కేరాఫ్ చిరునామా అయిన కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులో చికిత్స పొందుతూ మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహేష్ కు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చికిత్స కోసం రూ 17 లక్షల సాయం అందించారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ కు కారణమైంది. ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ చికిత్సకు రూ 17 లక్షలు ఇవ్వటం పైన తొలుత ప్రశంసలు వెల్లువెత్తాయి.

 వివాదాలకు చిరునామా కత్తి..

వివాదాలకు చిరునామా కత్తి..

ఆయన చికిత్సకు సంబంధించిన ఈ మొత్తాన్ని అపోలోకు అందిస్తామంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎల్వోసీ లేఖ ఆస్పత్రికి పంపారు. ఇక, దీని పైన తొలుత పెద్ద సంఖ్యలో ప్రశంసలు వచ్చినా..ఆ తరువాత మహేష్ గత తీరు పైన నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. మతం పైన విమర్శలు చేసి..పవన్ కళ్యాణ్ పైనా అప్పట్లో వివాద స్పద వ్యాఖ్యలు చేసి పెద్ద ఎత్తున కత్తి రచ్చకు కారణమయ్యారని వారు గుర్తు చేస్తున్నారు. మహేష్ పైన ఒక స్వామిజీ ఫిర్యాదు మేరకు ఆయన్ను హైదరాబాద్ నుండి బహిష్కరించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఎమ్మెల్యే అసహనంతో అగ్గి..

ఇదే సమయంలో అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే వద్ద ఒక వ్యక్తి తాను సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు పంపినా ఇంకా నగదు రాలేదంటూ అడగటం..ఎమ్మెల్యే అసహనంగా తన నియోజకవర్గానికి చెందినవే దాదాపు 900 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటూ సమాధానం ఇచ్చిన వీడియో హల్ చల్ చేస్తోంది. దీనిని కొందరు ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులు..ఆ వీడియోను సోషల్ మీడియో లో పోస్టు చేసి..ఒక్క నియోజకవర్గం లోనే 900 మంది బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఉండే కత్తి మహేష్ కు ఏ కారణంతో ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నగదు సాయం చేసిందని ప్రశ్నిస్తున్నారు.

సీఎం సొంత సొమ్ము కాదంటూ..

సీఎం సొంత సొమ్ము కాదంటూ..


ఇన్నోవా కారులో తిరిగే వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ నుండి సాయం అవసరమా అన్నది వారి ప్రశ్న. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా సాయం చేస్తే తమకు అభ్యంతరం లేదని..సీఎంఆర్ఎఫ్ అంటే ప్రజల సొమ్మని చెబుతూ..ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. దీంతో.. ప్రభుత్వ సాయం పైన మద్దతుగా కొందరు..వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అయితే, కత్తి మహేష్ ఎంతటి వివాదస్పద వ్యక్తి అయినా..ఆయన సీరియస్ కండీషన్ లో ఉండటంతో..చికిత్స కోసం మానవతా దృక్పథం తో ప్రభుత్వం సాయం చేసిందంటూ మరి కొందరు వ్యతిరేక వాదనను కౌంటర్ చేస్తున్నారు.

చికిత్స కోసమే..మానవతా దృక్పథం తో

చికిత్స కోసమే..మానవతా దృక్పథం తో

కత్తి మహేష్ సొంత జిల్లా చిత్తూరని..ఆయన ప్రమాదానికి గురైంది నెల్లూరు లో..చికిత్స తీసుకుంది నెల్లూరు ఆస్పత్రిలో కావటంతో పాటుగా ఆయన సన్నిహితులు సాయం కోరుతూ ఏపీ సీఎం కార్యాలయాన్ని అభ్యర్ధించటంతో ప్రభుత్వ పరంగా సాయం చేసారని వైసీపీ మద్దతు దారులు చెబుతున్నారు. అయితే, సీఎంఆర్ఎఫ్ ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు నిర్దేశించిన పధకమని.. అందులో ఎవరికి సాయం చేయాలనేది సీఎం విచక్షణాధికారంగా స్పష్టం చేస్తున్నారు. కత్తి మహేష్ ప్రాణాపాయం తప్పించేందుకు అందిస్తున్న చికిత్స కోసమే నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. దీని పైన వస్తున్న విమర్శలు..ట్రోలింగ్ పైన ప్రభుత్వం నుండి అధికారిక స్పందన మాత్రం రావాల్సి ఉంది. ఇక...ఇప్పుడు కత్తి మహేష్ కు ఆర్దిక సాయం..అధికార పార్టీ ఎమ్మెల్యే అసహనంతో సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఈ అంశం చర్చ నుండి రచ్చ రచ్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+