వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు పారాసిటామాల్: కేసీఆర్ జగన్‌లను ఆటాడేసుకుంటున్న నెటిజెన్లు, సైంటిస్టులంటూ..!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పైన ఈ ఇద్దరు మఖ్యమంత్రులు చేసిన విశ్లేషణ..వ్యాఖ్యల పైన ఇప్పుడు సీఎం లిద్దరూ సైంటిస్టులు అయ్యారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పారాసిటమాల్ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది.

కేసీఆర్ జగన్ లిద్దరూ సీఎంలు మాత్రమే కాదని సైంటిస్టులు అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ..మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశంలో కరోనా గురించి చెప్పిన అంశాల ఆధారంగా ఈ పోస్టింగ్ లు పోటీ పడీ మరీ ట్రోల్ చేస్తున్నారు. పారాసిటమాల్ చాలు అనే వ్యాఖ్యల ఆధారంగా ఈ ట్రోల్ కంటిన్యూ అవుతోంది.

coronavirus: మీడియాకు కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు, 31 వరకు బంద్, పెళ్లిళ్లపైనా ఆంక్షలుcoronavirus: మీడియాకు కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు, 31 వరకు బంద్, పెళ్లిళ్లపైనా ఆంక్షలు

ఇద్దరు సీఎంలు..సైంటిస్ట్ లు అయ్యారంటూ..

ఇద్దరు సీఎంలు..సైంటిస్ట్ లు అయ్యారంటూ..

కరోనా నివారణ పైన తెలంగాణ..ఏపీ మఖ్యమంత్రులు కేసీఆర్..జగన్ ఒక్క రోజు తేడాలో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల బాటలోనే హైదరాబాద్ నగరంలో ముందస్తు చర్యల్లో బాగంగా..జన సమూహానికి అవకాశం లేకుండా ఈ నెల 31వ తేదీ వరకు ఆంక్షలు ప్రకటించింది. అదే సమయంలో కరోనా గురించి కేసీఆర్ తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇది మరచిపోకముందే ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం కరోనా పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కేసీఆర్ అభిప్రాయాలనే దాదాపుగా జగన్

కేసీఆర్ అభిప్రాయాలనే దాదాపుగా జగన్

ఆ తరువాత మీడియా సమావేశంలో కరోనా గురించి మాట్లాడారు. కేసీఆర్ అభిప్రాయాలనే దాదాపుగా జగన్ వ్యక్తం చేసారు. అయితే, కేసీఆర్ తీసుకున్నట్లుగా ముందస్తు చర్యల్లో భాగంగా సెలవులు..వర్క్ ఫ్రం హోం వంటి నిర్ణయాలు అమలు చేయలేదు. ఇదే సమయంలో రానున్న కాలంలో ఇది కంటిన్యూ అవుతుందంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో స్థానిక సంస్థలను మాత్రం కరోనా కారణంగానే వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం నిర్ణయం ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కారణమనే వాదన ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

పారాసిటమాల్ వేసుకుంటే చాలా..అవే ట్రోల్స్..

పారాసిటమాల్ వేసుకుంటే చాలా..అవే ట్రోల్స్..

కరోనాను నివారించేందుకు కేవలం ఓ పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే చాలని ఇద్దరు సీఎంలు చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కరోనా నివారణపై ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ కూడా ఇలానే సమాధానం చెప్పారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా వేసుకునే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పారు. రాష్ట్రానికి కరోనా వైరస్ రాదని, తాము ఆ వైరస్‌ను రానివ్వమని స్పష్టం చేశారు. 22 డిగ్రీల ఉష్టోగ్రత దాటితే కరోనా వైరస్ బతకలేదన్నారు.

కరోనా వైరస్‌లో సీఎం లిద్దరూ సైంటిస్టులు అయ్యారని

కరోనా వైరస్‌లో సీఎం లిద్దరూ సైంటిస్టులు అయ్యారని

అదేవిధంగా కరోనాను నివారించాలంటే పారాసిటమాల్ సరిపోతుందని జగన్ కూడా ప్రకటించడం ఇప్పుడు ట్రోల్ అవుతోంది.కరోనా వైరస్‌లో సీఎం లిద్దరూ సైంటిస్టులు అయ్యారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పారాసిటమాల్ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. కేసీఆర్ జగన్ లిద్దరూ సీఎంలు మాత్రమే కాదని సైంటిస్టులు అని నెటిజన్లు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలోనే కాదు.. రాజకీయంగానూ వైరల్ గా మారాయి.

English summary
Netizens are trolling the two telugu states CM's KCR and Jagan for having said that Paracetamol will be sufficient for coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X