గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపి కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సంకేతాలిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో గుంటూరు-విజయవాడల మధ్యనే కొత్త రాజధానిని నిర్మించాలని వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడుకు కూడా ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధానిని ముందే ప్రకటిస్తే పలువురు వ్యాపారవేత్తలు, సంపన్నులు ఆ ప్రదేశంలోని భూములను భారీగా కొనుగోలు చేస్తారని, అది ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Andhra Pradesh capital near Guntur, Vijayawada

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయవాడ-గుంటూరుకు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ నుంచే తన అధికారిక కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది. రాజధాని ఏర్పాటు పనులను ఇక్కడ్నుంచే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలుగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేస్తామని ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా చెప్పడం గమనార్హం.

అయితే ఒంగోలు-ఏలూరు మధ్యలో కూడా కొత్త రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్నే రాజధానిగా ఏర్పాటు చేసే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున తమ పార్టీ నేతల కోరిక మేరకు విజయవాడ-గుంటూరు జిల్లాల మధ్యనే కొత్త రాజధానిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అనువుగా ఉండటంతో రాజధానిని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

English summary
Telugu Desam supremo and Andhra Pradesh Chief Minister-designate N. Chandrababu Naidu and Union minister for urban development M. Venkaiah Naidu have dropped enough hints on the location of new capital city of residuary AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X