ఎన్టీఆర్ పేరే, తప్పేంటి: రాజధానిపై యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెడతామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఎన్టీఆర్ పేరు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అయితే, రాజధాని నిర్మాణం తర్వాత ఎన్టీఆర్ పేరు ఖరారు చేస్తామన్నారు.

రాజధాని భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రులు పని ప్రారంభించారన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా కొన్ని కేంద్రం చూస్తే, మరికొన్నింటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని తెలిపారు. జిల్లాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
పాలన కేంద్రీకృతమవుతుందని తెలిపారు. ఇక చీఫ్ జస్టిస్‌ను సంప్రదించిన తర్వాతే హైకోర్టు ఎక్కడో ప్రకటిస్తామన్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చైనా ప్రతినిధులు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications