న్యూఢిల్లీ వెళ్లేవారికి ఇండియన్ రైల్వే ముఖ్య గమనిక
పొగమంచు వల్ల పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ (20806), నిజాముద్దీన్-విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ (12808), నిజాముద్దీన్-విశాఖ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ (1204) రైళ్లు పది గంటలకు పైబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై పొగ మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి బయలుదేరే ఏపీ ఎక్స్ ప్రెస్ ను రీ షెడ్యూల్ చేసి నడిపిస్తున్నారు.
న్యూఢిల్లీ నుంచి విశాఖ వచ్చే ఏపీ ఎక్స్‌ప్రెస్ (20806) శుక్రవారం 16 గంటలు ఆలస్యంగా నడిచింది. తెల్లవారుజామున 4.10 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా.. రాత్రి 10.00 గంటల ప్రాంతంలో వచ్చింది. దీనివల్ల రాత్రి 11.00 గంటలకు బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్ ప్రెస్ ను శనివారం ఉదయం 9.00 గంటలకు పంపించారు.

నిజాముద్దీన్ నుంచి విశాఖ వచ్చే సమతా ఎక్స్‌ప్రెస్ (12808) ఆరు గంటలు ఆలస్యంగా నడిచింది. సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం రావాల్సి ఉండగా.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వచ్చింది. నిజాముద్దీన్ నుంచి వచ్చే స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ (12804) మధ్యాహ్నం 2.15 గంటలకు రావాల్సి ఉండగా.. రాత్రి 9.30 గంటలకు వచ్చింది.
సికింద్రాబాద్ నుంచి నడిచే గరీబ్‌రథ్ (12739), విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016)తోపాటు మరికొన్ని రైళ్లు గంటకుపైగా ఆలస్యంగా విశాఖపట్నం చేరుకుంటున్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ (20805/20806), సమతా (12807/ 12808), స్వర్ణ జయంతి (12803/12804), విశాఖ-అమృతసర్-విశాఖ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807/20808)తోపాటు మరికొన్ని రైళ్లు కూడా పొగమంచు కారణంగా కొద్ది రోజులు ఆలస్యంగా నడుస్తాయంటున్నారు.












Click it and Unblock the Notifications