చాగంటి నియామకం పై కొత్త వివాదం - చంద్రబాబుకు 30 మంది లేఖ..!!
ఏపీ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ లో చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించింది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ నియామకం చేసింది. ఇప్పుడు ఈ వివాదం పైన కొత్త చర్చ మొదలైంది. పురాణ ప్రవక్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించ డం నిరాశ కలిగించిందంటూ30 మంది ప్రముఖులు సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ప్రభుత్వ నియామక నిర్ణయం పై పునరాలోచన చేయాలని కోరారు.
పునరాలోచన చేయాలి
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని కేటాయిం చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి నియామకం పైన ఇప్పుడు కొత్త చర్చ మొదలు పెట్టారు. విద్య విలువల సలహాదారుగా.. పౌరాణిక ఉపన్యాసకులను నియామం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు గేయానంద్ అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న వారు చాగంటి నియామకం పైన చర్చించారు. నిరసన వ్యక్తం చేసారు. ఈ నియామకం పైన పునరాలోచన చేయాలని కోరుతూ సమావేశంలో పాల్గొన్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసారు. సినీ దర్శకులు సి ఉమామహేశ్వరరావు, న్యాయ వాది సుంకర రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర రావుతో సహా పలువురు ప్రముఖులు ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు.

పురాణ యుగంలోకా
కూటమి ప్రభుత్వం ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తుందని ఆశిస్తున్న తమక విద్యార్ధుల నైతిక విలువల కోసం పురాణ ప్రవక్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. విద్యా వైజ్ఞానిక సామాజిక రంగాల్లో చిరకాలంగా పనిచేస్తున్న తాము ఈ లేఖ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవుడు ప్రకృతి రహస్యాలను ఒక్కోదాన్నీ గుప్పెట్లోకి తెచ్చుకొని, అంతరిక్షపు అంచులకు చేరుకుంటున్న కాలంలో మనం వున్నామని వివరించారు. ఇలా ప్రపంచమంతా పరుగులు తీస్తున్న ధోరణికి భిన్నంగా మన భవిష్యత్తరాన్ని పురాణ యుగంలోకి మళ్లించడం మనల్ని ఎక్కడికి తీసుకు వెళుతుందో తమ ప్రభుత్వం గుర్తించాలని లేఖలో సూచించారు.
సమకాలీన పోటీలో
మనది వైవిధ్య భరిత సాంస్కృతిక మూలాలున్న దేశంగా పేర్కన్నారు. ఈ భిన్నత్వమే మన శక్తీ, మన సౌందర్యమని వివరించారు. దీనిని కలకాలం నిలబెట్టుకో వడం ద్వారానే మనం సర్వతో ముఖాభివృద్ధి చెందగలమని చెప్పుకొచ్చారు. దీనికి తగినట్టు మన విద్యార్థుల్ని తీర్చగలిగేందుకు పౌరాణిక నీతులు ఎంతవరకు పనికొస్తాయో ఆలోచించాలని లేఖలో సూచించారు. మన విద్యా విధానం ఏ మాత్రం శాస్త్రీయంగా లేదని.. మన పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతు న్నారని వివరించారు. మొదట మన విద్యారంగంలో తీవ్రమైన మార్పులు తీసుకురావాల్సి ఉంద ని చెప్పుకొచ్చారు. వీటిని వున్నట్టే వుంచి పురాణకాలపు నైతిక విలువలను బోధించడంతో ఏం ప్రయోజనం వుంటుందని ప్రశ్నించారు. విద్యార్థుల్ని సమకాలీన ప్రపంచానికి సమర్థులైన ప్రతిని ధులుగా తీర్చిదిద్దడంలో పౌరాణిక పండితులు చేయగలిగిందేమీ లేదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications