కాకినాడ నుంచి అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు
పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ టౌన్- తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 'ట్రైన్స్ ఆన్ డిమాండ్' పేరుతో నడిచే ఈ రైళ్ల ద్వారా అరుణాచలానికి వెళ్లే భక్తులు, ఇతర ప్రయాణికుల సౌకర్యం కోసం దీన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ నెల 14వ తేదీన ఈ రైలు పట్టాలెక్కుతుంది.

ఈ నెల 14వ తేదీన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ టౌన్ నుండి బయలుదేరే నంబర్ 07617 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 6:30 గంటలకు తిరువణ్ణామలైకి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో- ఈ నెల 16వ తేదీన సోమవారం వేకుల జామున 3 గంటలకు తిరువణ్ణామలై నుండి బయలుదేరే నంబర్ 07618 ప్రత్యేక రైలు అదే రోజు రాత్రి 8:30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
సామర్లకోట (14:13/14:14), రాజమండ్రి (15:03/15:05), తణుకు (15:56/15:58), భీమవరం టౌన్ (16:43/16:45), అకివీడు (17:13/17:15), కైకలూరు (17:40/17:42), గుడివాడ (18:28/18:30), విజయవాడ (19:45/19:55), తెనాలి (20:34/20:35), చీరాల (21:14/21:15), ఒంగోలు (21:54/21:55) స్టేషన్లల్లో ఈ రైలు హాల్ట్ సౌకర్యం ఉంది.
అలాగే- నెల్లూరు (23:24/23:25), రేణిగుంట (1:15/1:25), తిరుపతి (1:45/1:50), పాకాల (2:28/2:30), చిత్తూరు (3:18/3:20), కాట్పాడి (3:55/4:00), వెల్లూరు (4:18/4:20) మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కమ్ ఏసీ టూ టైర్ కోచ్, ఏసీ టూ టైర్ కోచ్‌లు- 4, ఏసీ త్రీ టైర్ కోచ్‌లు- 6, స్లీపర్ క్లాస్ కోచ్‌లు- 8, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు- 2 అందుబాటులో ఉంటాయి. ఈ రైలుకు 6వ తేదీ నాడే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ ఆరంభమైంది కూడా.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications