ప్రభుత్వం అవసరం లేదు, అపాయింటెడ్ డే కోరా: శశిధర్

న్యూఢిల్లీ/హైదరాబాద్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. చేయకపోయినా పెద్ద తేడా ఏమి ఉండబోమని జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. గురువారం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

త్వరలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే వీలుండదు కాబట్టి కొత్త ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుందా లేదా అన్న సందేహాలకు శుక్రవారం తెరపడుతుందని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అపాయింటెడ్ డే అనేది ఎన్నికల కంటే ముందే ఉండాలని తాను దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.

Shashidhar Reddy

ఎన్నికలకు కసరత్తు ప్రారంభించాం: డిజిపి

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించామని డిజిపి ప్రసాదరావు తెలిపారు. గురువారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు శాఖ విభజనకు సంబంధించి కేంద్రహోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు.

అయితే తాము ఎన్నికలకు కూడా సంసిద్ధంగానే ఉన్నామని ప్రసాదరావు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైర ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు 35వేల పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు డిజిపి ప్రసాదరావు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+