పెళ్ళై మూడు రోజులే వరుడు మృతి, ఏమైందంటే?

విశాఖపట్టణం: పెళ్ళై మూడు రోజులు. కానీ, రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది విశాఖపట్టణం జిల్లాలో చోటు చేసుకొన్న ఈ ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

విశాఖపట్టణం జిల్లా ఎస్. రాయవరం మండలం గోకులపాడు జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్ళి కొడుకు వర్ష మృతి చెందాడు పెళ్ళై మూడు రోజులు మాత్రమే అయింది. భార్య, భర్తలు కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

New groom killed in road accident in vizag district

విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి శారదానగర్‌కు చెందిన కోరుకొండ శంకర్‌ సిరి వర్షకు తూర్పుగోదావరి జిల్లా పసలపూడికి చెందిన అమలాపురపు లక్ష్మీప్రభతో ఏప్రిల్ 18న వివాహం జరిగింది. ఏప్రిల్ 20న, రిసెప్షన్ జరిగింది. ఏప్రిల్ 21న, కొత్త వధూవరులు వర్ష లక్ష్మీప్రభలు, ఇతర బంధువులు కారులో రామచంద్రాపురం బయలుదేరారు.

గోకులపాడు వద్దకు కారు రాగానే ఈ కారు ముందుకు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వర్ష అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఎయిర్‌బ్యాగ్ ఓపెన్ కావడంతో లక్ష్మీప్రభ, మహాలక్ష్మిలు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

అయితే ఈ ప్రమాదంలో వర్ష అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మీప్రభ ప్రాణాలతో బయటపడింది. అయితే పెళ్ళై మూడు రోజులకు వర్ష మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నవ వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+