మందు బాబులకు గుడ్ న్యూస్..బూమ్ బూమ్ బీర్లకు బై బై
నూతన మద్యం పాలసీపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో సచివాలయం వేదికగా మంత్రివర్గ ఉప సంఘంభేటీ అయింది. ఈ నేపథ్యంలో వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం కొత్త మద్యం పాలసీని మంత్రివర్గం ఎదుట ప్రవేశ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని.. మద్యం రేట్ పెరగడంతో పేదలు గంజాయికి అలవాటుపడ్డారని ప్రభుత్వం తెలిపింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. మార్పులు చేర్పులతో పాటు తదుపరి కార్యాచరణపై మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారంలోపు దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన అనంతరం నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు.

దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.అక్రమ మద్యం విధానం అమలు కోసం గత సర్కార్ సెబ్‌ను పెట్టిందని గుర్తుచేశారు. నకిలీ మద్యం బ్రాండ్లతో ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లను నిలిపివేశామని అన్నారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారి కల్లుగీత కార్మికులకు 10 శాతం దుకాణాలు ఇవ్వబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.గత ప్రభుత్వంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పాలకుల జేబుల్లోకి వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. నూతన మద్యం విధానం అమలు తర్వాత పాత బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications