సూర్యకుమారి కేసులో కొత్త ట్విస్ట్... కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల అనుమానం
ఐదు రోజుల క్రితం విజయవాడలో అదృశ్యమైన డాక్టర్ సూర్యకుమారి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. విజయవాడ గుండా ప్రవహించే రైవస్ కాలువలో దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్త
విజయవాడ: ఐదు రోజుల క్రితం విజయవాడలో అదృశ్యమైన డాక్టర్ సూర్యకుమారి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. విజయవాడ గుండా ప్రవహించే రైవస్ కాలువలో దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
27-30 ఏళ్ల వయసున్న యువతిని కాలువ ఒడ్డున చూసినట్లు, ఆమెకు చెందిన బైక్, చెప్పులు దొరికినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం 27 మంది ప్రత్యేక పోలీసుల బృందం రైవస్ కాలువలో గాలింపు పనులు చేపట్టింది. రైవస్ కాలువ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల కాలువ మొత్తం గాలించడం కొంచెం కష్టమైన పనే అని ఎన్డీఆర్ఎఫ్ బృందం అభిప్రాయపడుతోంది.
మరోవైపు తమ కుమార్తె ఏమై ఉంటుందోనని సూర్యకుమారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ సూర్యకుమారి కర్ణాటకకు చెందిన ఓ ఐఏఎస్ అధికారికి సోదరి. ఈ కేసులో ఇప్పటికే విద్యాసాగర్ అనే వ్యక్తిని పోలీసులు విచారించారు. అదృశ్యమవడానికి ముందు సూర్యకుమారి, విద్యాసాగర్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే!
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications