నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనం మనసు మారిందా - టీడీపీ ఆశలు గల్లంతు: భారీ ట్విస్ట్..!?

ఆనం వైసీపీని వీడటం ఖాయం. ఏ పార్టీలో చేరబోతున్నారు. టీడీపీలో చేరుతారని భావిస్తున్న వేళ కొత్త ట్విస్ట్.

|
Google Oneindia TeluguNews

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అడుగులు ఎటు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు. టీడీపీలోకి వెళ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కోటంరెడ్డి కూడా ఆనం బాట పట్టారు. ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ ఆసక్తి కర ట్విస్టులు మొదలయ్యాయి. ఆనం టీడీపీలోకి వెళ్లటం సందేహంగానే కనిపిస్తోంది. తాజాగా ఆనం తన మద్దతు దారులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉండటంతో..ఆచితూచి నిర్ణయం తీసుకుందామని చెప్పుకొచ్చారు. తాజాగా ఆనంతో ఇతర పార్టీల ముఖ్యులు మంతనాలు సాగిస్తున్నారు. మరి..ఆనం దారెటు..ఏం చేయబోతున్నారు...

వైసీపీకి దూరంగా ఆనం..టీడీపీలోకి ఎంట్రీ అంటూ

వైసీపీకి దూరంగా ఆనం..టీడీపీలోకి ఎంట్రీ అంటూ


గతంలో కాంగ్రెస్, టీడీపీలో పని చేసిన ఆనంకు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరి వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వం పైన ఆయన చేసిన వ్యాఖ్యలతో కొద్ది రోజుల క్రితం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోకవర్గంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని వైసీపీ ఇంఛార్జ్ గా నియమించారు. ఆనం భద్రత కుదించారు. ఆనం ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దీంతో, ఆనం ఇక టీడీపీలోకి వెళ్లటం ఖాయమనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఆనం తన మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దాని పైన ఆలోచనలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుందామని చెబుతున్నారు. అదే సమయంలో రెండు ప్రాంతీయ పార్టీలు కాకుండా..జాతీయ పార్టీల గురించి ఆయన ప్రస్తావించటం కీలకంగా మారుతోంది

ఆనంతో టచ్ లోకి బీజేపీ నేతలు..!

ఆనంతో టచ్ లోకి బీజేపీ నేతలు..!


ఇక ఆనం అధికార వైసీపీలో కొనసాగే పరిస్థితులు లేవు. ఆయన టీడీపీలోకి వెళ్లటానికి సీటు..గెలుపు అవకాశాలు..అధికారం పైన సంశయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైనా..బీజేపీ నిర్ణయం కోసం ఆ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఈ పొత్తులు..వైసీపీ బలా బలాలపైన ఆనం లెక్కలు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆనంతో బీజేపీ ముఖ్య నేతలు టచ్ లోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆనంతో కలిసి మంత్రిగా పని చేసి..బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తం ఆనంతో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ నేత జనసేనతో వెళ్తారనే ప్రచారంలో ఉన్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కూడా ఆనంకు మద్దతుగా ముందుకొచ్చారు. ఆనంతో తనకు ఉన్న సంబంధాలను ప్రస్తావించారు. ఆనం భద్రతను డీజీపీ తీసుకోవాలని డిమాండ్ చేసారు. టీడీపీ - జనసేన పొత్తు ఉన్నా..ఆనంను జనసేనలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఆనం నుంచి మాత్రం ఎక్కడా ఈ వ్యవహారాల పైన స్పందించటం లేదు.

బీజేపీ నేతల ఆఫర్.. రూటు మారేనా

బీజేపీ నేతల ఆఫర్.. రూటు మారేనా


ఇదే సమయంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. టీడీపీ, వైసీపీల‌లో అసంతృప్త నాయ‌కుల్ని త‌మ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది. ఆనంను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఒక ప్రముఖ నేత చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పూర్తిగా ఆనంకు బాధ్యతలు ఇవ్వటంతో పాటుగా పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆనం పార్టీలోకి వస్తే జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో పార్టీకి ఉపయోగం ఉంటుందని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక నేత మధ్యవర్తి ద్వారా ఆనంకు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. తాజాగా ఆనం రెండు ప్రాంతీయ పార్టీలు..జాతీయ పార్టీల బలోపేతం గురించి చేసిన వ్యాఖ్యలతో ఆనంకి టీడీపీ మాత్రమే ప్రత్యామ్నాయం కాదనేది స్పష్టమవుతోంది. బీజేపీ..జనసేన..బీఆర్ఎస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో..ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Venkatagiri MLA Anam Ramanrayana Reddy seem to be not willing to join in TDP, otehr party leaders touch with Anam As per reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X