వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ ట్విస్ట్: వైసిపి శిల్పా నామినేషన్ చెల్లదని టిడిపి ఫిర్యాదు, ఇదీ కారణం

నంద్యాల ఉప ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

ముద్దులు కాకుండా ఏంచేస్తాడు, బతకనిస్తాడా: జగన్‌పై జలీల్ సంచలనంముద్దులు కాకుండా ఏంచేస్తాడు, బతకనిస్తాడా: జగన్‌పై జలీల్ సంచలనం

శిల్పా నామినేషన్ నిబంధనల ప్రకారం లేదని ఫిర్యాదు

శిల్పా నామినేషన్ నిబంధనల ప్రకారం లేదని ఫిర్యాదు

నామినేషన్ నిబంధనల ప్రకారం లేదని టిడిపి నేతలు రిటర్నింగ్ అధికారికి చెప్పారు. నిబంధనల ప్రకారం జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ వాడలేదని వారు ఆరోపిస్తున్నారు. అఫిడవిట్‌పై సంతకం చేసిన నోటరీ రెన్యూవల్ కాలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Recommended Video

Watch Exclusive Audio Clip : Parigi MLA Ram Mohan Reddy Vulgar Words In Phone Call - Oneindia Telugu
రోజు రోజుకు రసవత్తరంగా నంద్యాల

రోజు రోజుకు రసవత్తరంగా నంద్యాల

నంద్యాల ఉప ఎన్నికలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల జగన్ నంద్యాలలో పర్యటించి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి మరింత ఆసక్తిగా మారింది. టిడిపి నేతలు ప్రధానంగా జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అలాగే, శిల్పా చక్రపాణి రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ప్రత్యర్థిని ఇరుకున పడేసేందుకు ప్రయత్నాలు

ప్రత్యర్థిని ఇరుకున పడేసేందుకు ప్రయత్నాలు

నంద్యాల ఉప ఎన్నికలు మరో పదిహేను రోజులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి, వైసిపిలు పోటీపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాటల యుద్ధంతో పాటు ప్రత్యర్థిని ఇరుకున పడేసేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

శిల్పా దూకుడుకు చెక్ పెట్టేందుకు..

శిల్పా దూకుడుకు చెక్ పెట్టేందుకు..

ఇందులో భాగంగా శిల్పా మోహన్ రెడ్డి దూకుడుకు చెక్ పెట్టేందుకు టిడిపి తాజాగా అఫిడవిట్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. టిడిపి ఆరోపణలపై వైసిపి స్పందించాల్సి ఉంది. నిబంధల ప్రకారం లేని నామినేషన్‌ను తిరస్కరించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. మరోవైపు, ఇరువైపుల నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.

English summary
New twist in Nandyal bypoll. Telugu Desam Party on Monday complained YSR Congress Party's Silpa Mohan Reddy nomination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X