విజయవాడ నుంచి 9 గంటల్లో బెంగళూరు వయా తిరుపతి- ఏపీకి మరో వందే భారత్..!!
ఏపీ నుంచి మరో వందేభారత్ అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు పెరుగుతున్న వందేభారత్ డిమాండ్ కు అనుగుణంగా రూట్లు ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నైకి వందేభారత్ సర్వీసు కొనసాగుతోంది. తాజాగా, విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్తగా వందేభారత్ ప్రారంభం కానుంది. దీని ద్వారా నాలుగన్నర గంటల్లోనే విజయవాడ టు తిరుపతి చేరుకోవచ్చు. ఈ రైలు రూట్, టైమింగ్స్ ఖరారు చేసారు
కొత్తగా వందేభారత్
విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇది స్టార్ట్ అయితే దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. కొత్తగా రాబోయే ఈ ట్రైన్ (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుతుంది.

నాలుగున్నార గంటల్లో తిరుపతికి
ఈ రైలు మార్గం.. టైమింగ్స్ మేరకు కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి, కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ వెళ్లే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. త్వరలో రాబోయే వందే భారత్ ట్రైన్‌తో తక్కువ సమయంలోనే గమ్యస్థానాలను చేరుకోవడంతో పాటు, ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.
ఏపీకి వందేభారత్ స్లీపర్
ఏపీ నుంచి వందేభారత్ స్లీపర్ కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విజయవాడ నుంచి అయోధ్య/ వారణాసి వరకు కొత్తగా సర్వీసు ప్రారంభించాలని భావిస్తున్నారు. వందేభారత్ తొలి విడత కేటాయింపుల్లోనే ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఇక.. రాబోయే రెండు, మూడేళ్లలో దేశంలో 200 కొత్త వందేభారత్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో చైర్‌కార్‌తో పాటు స్లీపర్ ట్రైన్లు కూడా ఉండనున్నాయి. అదే విధంగా 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17 వేల 500 జనరల్ నాన్ ఏసీ కోచ్‌లు రాబోతున్నాయి. కొత్త అమృత్ భారత్ రైళ్ల ద్వారా తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీ మరింతగా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications