కర్ణాటక నుంచి తిరుపతికి వీక్లీ ఎక్స్ ప్రెస్- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Tirupati trains: కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తులకు రైల్వే మంత్రిత్వ శాఖ తీపి కబురు వినిపించింది. తిరుపతికి ఓ కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్ కూడా విడుదల అయింది.
- జులై 3వ తేదీన ఈ రైలు పట్టాలు ఎక్కనుంది. ప్రతి గురువారం రాత్రి తిరుపతి నుంచి 9 గంటలకు బయలుదేరే నంబర్ 17423 వీక్లీ ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు చిక్ మగళూరుకు చేరుకుంటుంది.

- ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు చిక్ మగళూరు నుంచి బయలుదేరే నంబర్ 17424 వీక్లీ ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 7:40 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.
- చిత్తూరు, కాట్పాడి, కుప్పం, బంగారుపేట, వైట్ ఫీల్డ్, కృష్ణరాజపురం, సర్ ఎం విశ్వేశ్వరయ్య బెంగళూరు, చిక్క బాణవార, తుమకూరు, తిపటూరు, అరసికెరె, దేవనూరు, బిరూరు, కడూరు, బిసిళేహళ్లి, సకరాయపట్టణ మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.
ఈ వివరాలను కర్ణాటకకు చెందిన రైల్వే శాఖ మంత్రి వీ సోమణ్ణ వెల్లడించారు. మలేనాడు, తుమకూరు, బెంగళూరు నుంచి శ్రీవేంకటేశ్వర్ స్వామివారి దర్శనం కోసం తిరుపతికి వెళ్లే భక్తుల కోసం చిక్ మగళూరు నుంచి వీక్లీ ఎక్స్ ప్రెస్ ను నడిపించాలనే డిమాండ్ ను నెరవేర్చామని అన్నారు.
ತಿರುಪತಿಯ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರನ ದರ್ಶನಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಣಿಸುವ ಮಲೆನಾಡು, ತುಮಕೂರು, ಬೆಂಗಳೂರು ಹಾಗೂ ಕೋಲಾರ ಭಾಗದ ಭಕ್ತರಿಗೆ ಸೌಲಭ್ಯ ಕಲ್ಪಿಸಲು ಚಿಕ್ಕಮಗಳೂರಿನಿಂದ ತಿರುಪತಿಗೆ ನೂತನ ವಾರದ ರೈಲಿನ (Weekly Train) ಸಂಚಾರಕ್ಕೆ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಲಾಗಿದೆ. ಪ್ರತಿ ಗುರುವಾರ ತಿರುಪತಿಯಿಂದ ಹಾಗೂ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಚಿಕ್ಕಮಗಳೂರಿನಿಂದ ಈ ರೈಲು… pic.twitter.com/apW3Wfx78a
— V. Somanna (@VSOMANNA_BJP) June 28, 2025
రైల్వేల అభివృద్ధికి, ప్రయాణికులు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని సోమణ్ణ చెప్పారు. వేల కోట్ల రూపాయలతో అమృత్ భారత్ పథకాన్ని అమలు చేస్తోన్నామని, దీనికింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలను మార్చివేశామని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications