ఏపీలో పీక్స్‌లో కరోనా టెస్టింగ్స్: అదే స్థాయిలో పాజిటివ్ కేసులు: మరణాలూ ఆ రేంజ్‌లోనే

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ అడ్డు, అదుపు లేకుండా చెలరేగుతోంది. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి చర్యలను తీసుకుంటున్నప్పటికీ.. అడ్డుకట్ట పడట్లేదు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు కూడా గరిష్ఠస్థాయికి చేరుకుంటున్నాయి. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 12 వేలకు పైగా కరోనా వైరస్ వైద్య పరీక్షలను అధికారులు నిర్వహించారు.

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 82 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన పరీక్షల సందర్భంగా 82 కేసులు కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ 24 గంటల వ్యవధిలో మొత్తం 12,613 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

Newly 82 Covid-19 positive cases reported in Andhra Pradesh last 24 hours.

ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3200కు చేరుకుంది. ఇప్పటిదాకా 2209 మంది డిశ్చార్జి అయ్యారు. 64 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌గా కరోనా కేసుల సంఖ్య 927గా నమోదైంది. 927 మంది కరోనా వైరస్ పేషెంట్లు రాష్ట్రంలోని వేర్వేరు కోవిడ్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో వైరస్ వల్ల ఒక్కరు కూడా మరణించలేదని పేర్కొన్నారు.

విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిలో 112 మంది కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. వారిలో ఇప్పటిదాకా ఒక్కరు మాత్రమే డిశ్చార్జి అయ్యారని, 111 యాక్టివ్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలానికి చేరుకుని వైరస్ బారిన పడిన వారి సంఖ్య 479కి చేరుకోగా.. ఇందులో యాక్టివ్‌గా ఉన్న కేసులు 282గా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+