సీఎం పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడకూడదండి: ఇట్లు.. ముద్రగడ

Mudragada Padmanabham: వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉండే పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ ఏర్పాటైంది. మొత్తం 33 మందికి ఇందులో సభ్యత్వాన్ని కల్పించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, కో-ఆర్డినేట‌ర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.

ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అలాగే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్‌, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు.

Newly appointed YSRCP s PAC member Mudragada Padmanabham thanked to YS Jagan

తమ్మినేని సీతారాం, పీడిక రాజన్న దొర, బెల్లాన చంద్రశేఖర్, గొల్ల బాబురావు, బూడి ముత్యాలనాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు), చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్.. ఇందులో అపాయింట్ అయ్యారు.

అలాగే- జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ బాబు, ఆదిమూలపు సురేష్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్‌ అవినాష్ రెడ్డి ఉన్నారు.

వీరితో పాటు అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాలగుండ్ల శంకర నారాయణ, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథ్‌.. పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ సభ్యులుగా నియమితులయ్యారు.

కాగా- తనను పీఏసీ సభ్యుడిగా నియమించినందుకు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పందించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభరెడ్డి పేరుతో వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే పేరు మార్చుకుంటానంటూ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

తనపై పెట్టిన బాధ్యతను త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తానని, పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకూ కష్టపడతానని ముద్రగడ పేర్కొన్నారు. పేదలకు వైఎస్ జగన్ ఒక్కరే ఆక్సిజన్ అని వ్యాఖ్యానించారు. ఈ దఫా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు పరిపాలన సాగించాలని మనస్ఫూర్థిగా కోరుకుంటోన్నట్లు చెప్పారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+