వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల బైపోల్: గోస్పాడు పోలింగ్ బూత్ వద్ద వాళ్లే సెంటరాఫ్ ఎట్రాక్షన్!

ఈరోజు పెళ్లి కావాల్సిన ఓ నవ జంట.. పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటేసి వెళ్లారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: పార్టీల ప్రచారాలు.. ప్రలోభాలకు తెరదించుతూ ఓటరు మనోగతాన్ని ఆవిష్కరించే ఎన్నిక షురూ అయిపోయింది. నంద్యాల ఉపఎన్నికలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటుండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ ఓటింగే నమోదయ్యేలా ఉంది.

ఉదయం 10 గంటల లోపే 25 శాతం పోలింగ్ నమోదు కావడంతో 80శాతం పోలింగ్ నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వృద్దులను సైతం పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చి ఓటు వేయించి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గోస్పాడు పోలింగ్ బూత్ వద్ద ఒక సీన్ అందరిని ఆకట్టుకుంది.

newly wed couple casts vote at gospad polling booth

ఈరోజు పెళ్లి కావాల్సిన ఓ నవ జంట.. పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటేసి వెళ్లారు. క్యూలో నిలుచుకున్న వీరిద్దరు అక్కడ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఓటింగ్ పట్ల ప్రజలు కనబరుస్తున్న శ్రద్దకు ఇదే నిదర్శనం అంటున్నారు అధికారులు.

2019ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికలను సెమీ ఫైనల్‌గా చెప్పుకుంటుండటం, మూడేళ్ల టీడీపీ పాలనకు ఈ ఎన్నికను రెఫరెండంగాను పరిగణిస్తుండటంతో.. ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

English summary
Newly wed couple casts their vote at Gospad polling booth, they are the center of attraction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X