జోగి రమేష్ జంప్ - వారితో రాయబారం, అక్కడే అసలు ట్విస్ట్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. ఇంకా కొందరు సీనియర్లు కూటమి నేతలతో టచ్ లో ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన జోగి రమేష్ పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి నేతలతో కలిసి ఆయన తాజాగా ర్యాలీలో పాల్గొనటం.. కొంత కాలంగా వైసీపీ వ్యహారాలకు దూరంగా ఉంటున్నారు. కూటమి లో చేరేందుకు రాయబారం నడిపారు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది.

వైసీపీని వీడేందుకు జోగి రమేష్ సిద్దమైనట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం జోగి రమేష్ మంత్రిగా పని చేసారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పైన పలు సందర్భాల్లో తీవ్రంగా వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణకు హజరయ్యారు. జోగి కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసు నమోదైంది. దీంతో, కొంత కాలంగా జోగి రమేష్ పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్ట నట్లుగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగింది.

News Speculating that Jogi Ramesh to leave YSRCP chances to join in NDA parties soon

కాగా, తాజాగా టీడీపీ నేతలతో జోగి రమేష్ కనిపించటంతో పార్టీ మార్పు ప్రచారం మొదలైంది. నూజివీడు బస్టాండు సెంటర్‌లో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాన్ని మంత్రి పార్థసారధి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలిసి ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న జోగి రమేష్ ఆ సమయంలో జరిగిన ర్యాలీకి హాజరయ్యారు. కొంత కాలంగా జోగి రమేష్ పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతున్నా..ఆయన ఖండించలేదు. ఇప్పుడు టీడీపీ ర్యాలీలో కనిపించటంతో ఇక పార్టీ మార్పు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి.

అయితే, గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు రాజకీయాలకు సంబంధం లేదని జోగి రమేష్ మద్దతు దారులు చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ పైన గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ కు కూటమిలోకి అవకాశం ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు జోగి రమేష్ తరపు రాయబారం చేస్తున్న నేతలు ఎటూ తేల్చలేక పోతున్నారు. మరి, జోగి రమేష్ పార్టీ మార్పు పైన స్పందిస్తేనే.. స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+