టీడీపీలోకి ఎంపీ వేమిరెడ్డి - నెల్లూరులో జగన్ ప్లాన్ "బీ"..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారింది. నెల్లూరు జిల్లాలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్దిగా వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసింది. తాను కోరిన విధంగా ఎమ్మెల్యే అభ్యర్దులను ఖరారు చేయకపోవటంతో వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. తాజాగా చంద్రబాబుతో భేటీ అయినట్లు సమాచారం. దీంతో, నెల్లూరులో సీఎం జగన్ ప్లాన్ బీ అమలుకు సిద్దమయ్యారు.
మారుతున్న లెక్కలు: నెల్లూరు జిల్లా తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కొద్ది నెలల క్రితం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఆ ముగ్గురి పైన పార్టీ వేటు వేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ది గా పార్టీ రంగంలోకి దించింది.

ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా పోటీ చేయిస్తోంది. తాను ఎంపీగా పోటీ చేయాలంటే నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావలి అభ్యర్దులను మార్పు చేయాలని వేమిరెడ్డి కోరారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను నర్సరావు పేట ఎంపీగా ప్రకటించారు. ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ ను ప్రకటించారు. దీని పైన వేమిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. పార్టీని వీడాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.
టీడీపీలోకి వేమిరెడ్డి..?: నెల్లూరు సిటీ సీటును తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతికి ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు. పార్టీ నుంచి ఈ మేరకు సానుకూల నిర్ణయం రాకపోవటంతో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వేమిరెడ్డి పార్టీ నేతలతో అందుబాటులో లేరు. వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. వైసీపీ సీటు నిరాకరించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో సమావేశమైన వేమిరెడ్డి ఆ తరువాత చంద్రబాబును కలిసినట్లు సమాచారం.
ఇదే సమయంలో ఆదాలతోనూ ఈ ఇద్దరు టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. దీంతో..జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి వేమిరెడ్డి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదాల ఇప్పటికే తాను వైసీపీ వీడటం లేదని స్పష్టత ఇచ్చారు. గతంలో వేమిరెడ్డి సైతం తాను వైసీపీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం మొదలైంది.
జగన్ ఏం చేయబోతున్నారు: నెల్లూరులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై జగన్ తాజాగా ముఖ్య నేతలతో చర్చించారు. వేమిరెడ్డి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. వేమిరెడ్డి పార్టీ మారటం ఖాయమైతే ప్రత్యామ్నాయంగా అభ్యర్ది ఎవరనే దాని పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ స్థానంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
వేమిరెడ్డి పార్టీ వీడితే ఆయన స్థానంలో ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తో పాటుగా మరో ప్రముఖ వ్యాపార వేత్త పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఆత్మకూరు నుంచి మేకపాటి కుటుంబం నుంచి మహిళ పోటీ చేస్తారని చెబుతున్నారు. వచ్చే వారం నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో, ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications