మార్చిలోనే బిజెపి పొత్తుపై స్పష్టత, ఏపీపై కేంద్రం చిన్న చూపు: కేశినేని సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: బిజెపితో పొత్తు కొనసాగుతోందో, తెంచుకొంటామనే విషయమై మార్చి మాసంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు తేలుస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను నెరవేర్చాలని నాని డిమాండ్ చేశారు.

బాబు ఉండగా జెఎసి ఎందుకు, కేంద్రం మాటలను నమ్మేది లేదు: కేశినేని సంచలనం

ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తానని ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని విజయవాడ ఎంపీ నాని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతోందని నాని ప్రకటించారు.

బాబాయ్‌తో విభేదాల్లేవ్, అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చాను: రామ్మోహన్ నాయుడు

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరైనా పోరాటం చేస్తామని కేశినేని నాని ప్రకటించారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడెవరు?

బిజెపితో పొత్తుపై మార్చిలో స్పష్టత

బిజెపితో పొత్తుపై మార్చిలో స్పష్టత

మార్చి 5వ, తేది నుండి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చాల్సిందేనని టిడిపి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మార్చి నెల నాటికి నిధుల విషయమై స్పష్టత రాకపోతే బిజెపితో పొత్తును కొనసాగించాలో ,తెంచుకోవాలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని నాని చెప్పారు.

పోరాటం మరింత ఉధృతం చేస్తాం

పోరాటం మరింత ఉధృతం చేస్తాం

ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడిని పెంచేందుకుగాను రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఆందోళనలకు కేంద్రం స్పందించకపోతే ఒత్తిడిని మరింత తీవ్రం చేసేందుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

ఏపీపై కేంద్రం చిన్నచూపు

ఏపీపై కేంద్రం చిన్నచూపు

ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అర్ధమౌతోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు సాగిస్తున్నా కేంద్రం నుండి సానుకూలంగా స్పందించని పరిస్థితి నెలకొందన్నారాయన. ఇతర పార్టీలు తమ ఆందోళనలకు మద్దతు ప్రకటించాయని కూడ నాని గుర్తు చేశారు.

వైసీపీ డ్రామాలు చేస్తోంది

వైసీపీ డ్రామాలు చేస్తోంది


ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని వైసీపీ ప్రకటించిందని విజయవాడ ఎంపీ కేశినేని నాని గుర్తు చేశారు.కానీ, ఇ:తవరకు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రయోజనం కల్గించాలనే ఉద్దేశ్యంతోనే తాము పోరాటం చేస్తున్నామన్నారు. కేసుల మాఫీ కోసమే వైసీపీ బిజెపితో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోందని నాని ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam MP Kesineni Nani said the clarity on the alliance issue with BJP will be known in the next session of the Parliament. Vijayawada MP has made it clear that they will continue to fight in the Parliament till the demands are fulfilled.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి