ఏపీలో రాబోయే రెండ్రోజుల్లో వర్షాలు: కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో ఈ వానలు కురుస్తాయని తెలిపింది.
మంగళవారం ఉత్తరకోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.

బుధవారంనాడు ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో బుధవారంతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండో చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారంనాడు దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తుయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, అల్పపీడనం కారణంగా గత కొద్ది రోజులుగా ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి.
Recommended Video
బుధవారం నాడు దక్షిణకోస్తాంధ్రలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉండనుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోసర్తు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications