టోల్‌ గేట్లకు గుడ్‌బై… ఇకపై స్మార్ట్ టోల్ వసూళ్లు

హైవేపై ఎంత వేగంగా ప్రయాణించినా... టోల్‌ప్లాజా దగ్గర మాత్రం బ్రేక్‌ వేయాల్సిందే. ఫాస్టాగ్‌ ఉన్నా, సిగ్నల్‌ గ్రీన్‌ అవ్వాలి... బారియర్‌ పైకి లేవాలి... అప్పుడే ముందుకెళ్లాలి. పండగలప్పుడు, వీకెండ్‌లలో అయితే టోల్‌ క్యూల్లో గడిపే సమయం ప్రయాణానికంటే ఎక్కువగా అనిపించే సందర్భాలు ఉంటాయి. ఈ అసౌకర్యానికి ముగింపు పలకాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనం ఆపకుండానే టోల్‌ కట్టే 'మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో' (MLFF) విధానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఆగకుండా టోల్‌ చెల్లింపు... ఎలా సాధ్యం?

ఈ వ్యవస్థలో టోల్‌బూత్‌లు, బారియర్లు ఉండవు. ప్లాజా పైన ఏర్పాటు చేసే గ్యాంట్రీలపై అధునాతన సాంకేతిక పరికరాలు అమర్చుతారు.

  • ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఫాస్టాగ్‌ రీడర్లు
  • ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు
  • శాటిలైట్‌, జీపీఎస్ సాంకేతికత
NHAI to Launch Multi Lane Barrier Free Flow Toll System on Vijayawada Guntur Highway Stretch Soon

వాహనం టోల్‌ ప్రాంతానికి చేరుకునేలోపే కెమెరా నంబర్‌ప్లేట్‌ను గుర్తిస్తుంది. అదే సమయంలో ఫాస్టాగ్‌ స్కాన్‌ అయి, టోల్‌ ఫీజు ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం వాహనం వేగం తగ్గించకుండానే పూర్తవుతుంది.

విజయవాడ బైపాస్‌లో Toll Plaza..

కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న కాజ టోల్‌ప్లాజాలో ఈ విధానం అమలు చేయనున్నారు. అలాగే విజయవాడ బైపాస్‌లో వెంకటపాలెం సమీపంలోని టోల్‌ప్లాజాలో కూడా ఇదే విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న బూత్‌లు, బారియర్లు దశలవారీగా తొలగించనున్నారు. ఫాస్టాగ్‌ లేని వాహనాల కోసం ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేస్తారు. అక్కడ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. అయితే సాధారణ టోల్‌ రుసుముపై అదనంగా 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లింపునకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఆ సందర్భంలో టోల్‌ మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. దీని ఉద్దేశం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం.

ప్రజలు పెట్టుబడులు పెట్టే విధంగా..

విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు సుమారు 69.4 కిలోమీటర్ల మేర ఉన్న హైవే సెక్షన్‌లో ప్రజలు పెట్టుబడులు పెట్టే విధంగా ప్రత్యేక నమూనా రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని హైవేల్లో 'టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్' (TOT) విధానం అమల్లో ఉంది. 15 ఏళ్లలో వచ్చే టోల్‌ ఆదాయాన్ని ముందుగానే అంచనా వేసి, ఆ మొత్తాన్ని చెల్లించే సంస్థలకు నిర్వహణ హక్కులు ఇస్తారు. ఇప్పుడు 'పబ్లిక్ ఇన్విట్' రూపంలో ప్రజల నుంచే పెట్టుబడులు సమీకరించి, టోల్‌ ఆదాయంలో లాభాలను పంచే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు సెక్షన్లలో ఈ మార్గం కూడా ఒకటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+