వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై ముగిసిన విచారణ(పిక్చర్స్)
హైదరాబాద్: సిమి ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో గురువారం విచారణ ముగిసింది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. తీవ్రవాదులకు సంకెళ్లు వేసి ఎందుకు తరలించాల్సి వచ్చిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రశ్నించింది.
ప్రమాదకరమైన తీవ్రవాదులు కాబట్టే సంకెళ్లు వేసి తరలించామని ఐజీ నవీన్ చంద్ వివరణ ఇచ్చారు. హైదరాబాద్ జైలులో తీవ్రవాదులకు అనువైన బ్యారక్ లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఐజీ తెలిపారు. తీవ్రవాదులకు అనువైన బ్యారక్ ఉన్న వరంగల్ నుంచి కోర్టుకు తరలిస్తున్నామని ఐజీ పేర్కొన్నారు.
విచారణ నిమిత్తం కోర్టుకు తరలిస్తుండగా వికారుద్దీన్ ముఠా తమపై దాడికి ప్రయత్నించిందని, ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించడంతో తాము కాల్పులు జరిపామని తెలిపారు. ఏప్రిల్ 7న జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

విచారణ
సిమి ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో గురువారం విచారణ ముగిసింది.

విచారణ
జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. తీవ్రవాదులకు సంకెళ్లు వేసి ఎందుకు తరలించాల్సి వచ్చిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రశ్నించింది.

విచారణ
ప్రమాదకరమైన తీవ్రవాదులు కాబట్టే సంకెళ్లు వేసి తరలించామని ఐజీ నవీన్ చంద్ వివరణ ఇచ్చారు.

విచారణ
హైదరాబాద్ జైలులో తీవ్రవాదులకు అనువైన బ్యారక్ లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఐజీ తెలిపారు. తీవ్రవాదులకు అనువైన బ్యారక్ ఉన్న వరంగల్ నుంచి కోర్టుకు తరలిస్తున్నామని ఐజీ పేర్కొన్నారు.

విచారణ
విచారణ నిమిత్తం కోర్టుకు తరలిస్తుండగా వికారుద్దీన్ ముఠా తమపై దాడికి ప్రయత్నించిందని, ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించడంతో తాము కాల్పులు జరిపామని తెలిపారు.

విచారణ
ఏప్రిల్ 7న జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications