వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు మళ్లీ షాక్ -ఓటరు జాబితాపై నిమ్మగడ్డ ఆదేశాలు -ఫిబ్రవరిలోనే పోల్స్ -సీఎస్‌కు మరో లేఖ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ వర్సెస్ నిమ్మగడ్డలా కొనసాగుతోన్న వివాదం మరో కీలక మలుపు తిరింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించబోమని వైసీపీ సర్కారు మొడికేస్తుండగా, ఫిబ్రవరిలోనే పోల్స్ జరిపేలా ఏపీ ఎన్నికల కమిషనర్ తాజాగా అనూహ్య ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం నో చెబుతుందని తెలిసినా నిమ్మగడ్డ మరోసారి బంతిని అవతలి కోర్టులోకి విసిరారు. లోకల్ ఎన్నికలపై అటు అసెంబ్లీలో, ఇటు హైకోర్టులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా మలుపు మరింత ఉత్కంఠ రేపుతున్నది.

ఓటరు ఐడీలపై ఈసీ సంచలన నిర్ణయం -ఆధార్ తరహాలో అందరికీ డిజిటల్ ఓటరు కార్డులు -జారీ ఎప్పుడంటేఓటరు ఐడీలపై ఈసీ సంచలన నిర్ణయం -ఆధార్ తరహాలో అందరికీ డిజిటల్ ఓటరు కార్డులు -జారీ ఎప్పుడంటే

 సీఎస్ సాహ్నికి మరో లేఖ

సీఎస్ సాహ్నికి మరో లేఖ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కుదుటపడటంతో స్థానిక ఎన్నిల ప్రక్రియ ఆరంభించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ గత నెల చివరి వారంలో లేఖ రాయడం, కరోనా ప్రమాదం ఇంకా కొనసాగుతున్నందున ఇప్పట్లో ఎన్నికలు కుదరబోవని నిమ్మగడ్డకు నీలం జవాబివ్వడం, సదరు జవాబు రాజ్యాంగ విరుద్ధమని ఎస్ఈసీ ఆక్షేపించడం తెలిసిందే. ఆ తర్వాత.. ఎన్నికల ప్రక్రియపై స్టే విధించాలంటూ జగన్ సర్కారు పిటిషన్ వేయడంతో సీన్ హైకోర్టుకు మారింది. అయితే, స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే సీఎస్ సాహ్నికి శుక్రవారం మరో లేఖ రాశారు. అందులో..

Recommended Video

ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సహకరించండి- ఏపీ సీఎస్‌కు మ‌రోసారి నిమ్మగడ్డ లేఖ
2021 ఓటర్ల జాబితా ప్రక్రియ

2021 ఓటర్ల జాబితా ప్రక్రియ

వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తూ ఎస్ఈసీసీ.. సీఎస్‌ కు తాజాగా లేఖలో హైకోర్టు కోర్టు ఆదేశాలను కీలకంగా ప్రస్తావించారు. పంచాయితీ ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి నిధులు రాబోవని, ప్రక్రియ నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్ కే ఉంటాయన్న హైకోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో పోల్స్ జరిపేందుకు వీలుగా.. 2021 ఓటరు జాబితా సవరణలను చేపట్టాలని, వచ్చే జనవరి నాటికి ఓటరు జాబితాను పూర్తి చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. కాగా,

నిమ్మగడ్డ దూకుడు..

నిమ్మగడ్డ దూకుడు..

ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరో లేఖ రాసిన ఎస్ఈసీ.. త్వరలోనే అన్ని జిల్లాల అధికారులతో కాన్ఫరెన్స్ కు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఎన్నికల ప్రిపరేషన్ కోసం కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ అధికారులతో ఎస్ఈసీ కాన్ఫరెన్స్ జరగాల్సి ఉన్నా, ప్రభుత్వ సహాయ నిరాకరణతో అది వాయిదాపడింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలు తనకు అనుకూలంగా ఉండటంతో నిమ్మగడ్డ మళ్లీ దూకుడు పెంచారు. ఎస్ఈసీ గత లేఖకు గరంగరం సమాధానమిచ్చిన సీఎస్.. తాజా లేఖపై ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.

ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం చేసినా

ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం చేసినా

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ సర్కారు ఈనెల 4న ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కు అనుకూల పరిస్థితులు లేవని, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని తీర్మానంలో పేర్కొన్నారు. ఎన్నికలు వద్దంటూ చట్టసభలో జరిగిన తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియగా గుర్తించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్.. గవర్నర్ ను కోరారు. గవర్నర్ తన వైఖరి చెప్పేలోపే, ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరించడంతో నిమ్మగడ్డ ముందుకు కదిలారు. దీనికి జగన్ సర్కారు ఎలాంటి కౌంటరిస్తుందో చూడాలి. నిమ్మగడ్డ పదవీ కాలం మార్చి వరకు ఉన్నందున అప్పటిదాకా ఎన్నికలు నిర్వహించకూడదని సీఎం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు -పరిటాల రవిపై ప్రేలాపనలొద్దు: సునీత వార్నింగ్ -ఆశలపై నీళ్లు చల్లిన జగన్గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు -పరిటాల రవిపై ప్రేలాపనలొద్దు: సునీత వార్నింగ్ -ఆశలపై నీళ్లు చల్లిన జగన్

English summary
amid jagan govt deniel for conducting local body elections, Andhra Pradesh State Election Commissioner (ap sec) nimmagadda ramesh kumar once again hits the ball. sec nimmagadda on friday wrote a letter to AP Chief Secretary neelam sahni to forward elections process and asked to prepare 2021 amended voter list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X