వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు సుప్రీం కోర్టులో నిమ్మగడ్డ రమేష్ కేసు విచారణ .. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. ఇక నేడు సుప్రీం కోర్టులో ఆయన కేసు విచారణకు రానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఎన్నో మలుపులు తిరిగిన రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు పరీక్షకు నిలిచింది.

ఏపీ ఎస్ఈబీ ఏర్పాటుపై రాజకీయ ప్రేరేపిత పిటీషన్ .. రివర్స్ లో పిటీషన్ వేసిన ఉద్యోగుల సమాఖ్యఏపీ ఎస్ఈబీ ఏర్పాటుపై రాజకీయ ప్రేరేపిత పిటీషన్ .. రివర్స్ లో పిటీషన్ వేసిన ఉద్యోగుల సమాఖ్య

నిమ్మగడ్డ రమేష్ కొనసాగింపును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్

నిమ్మగడ్డ రమేష్ కొనసాగింపును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్

నిమ్మగడ్డ రమేష్ కొనసాగింపును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఆ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఇక నేడు ఈ కేసును త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈ ధర్మాసనంలో సభ్యులుగా జస్టిస్ బోపన్న,జస్టిస్ బాబ్డే ,జస్టిస్ హ్రిషికేశ్ రాయ్ ఉన్నారు. ఇక సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగిస్తుందా? లేక ఏపీ సర్కార్ అభిప్రాయంతో న్యాయస్థానం ఏకీభవిస్తుందా అన్నది ఇప్పుడు ఏపీలో ఉత్కంఠ రేపుతోంది.

నిమ్మగడ్డ వ్యవహారంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మొదలైన రచ్చ

నిమ్మగడ్డ వ్యవహారంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మొదలైన రచ్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికల వాయిదాపై అసహనం వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్ , ఆ తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకురావడం, నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించడం అందరికీ తెలిసిందే.

సుప్రీం ముందు నేడు నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం

సుప్రీం ముందు నేడు నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం

ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తప్పు పట్టడమే కాకుండా,నిమ్మగడ్డ రమేష్ తొలగింపు ఆర్డినెన్స్ ను రద్దు చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతున్నారు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కొనసాగింపును వ్యతిరేకిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పుడు ఎన్నికల సందర్భంగా మొదలైన రచ్చ నేటికీ కొనసాగుతూనే ఉంది. నేడు సుప్రీం ధర్మాసనం ముందు నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మరోసారి తమ వాదన వినిపించనున్నారు. ఈ వ్యవహారంలో ఏం తీర్పు రానుందో అన్నది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

English summary
state election commissioner Nimmagadda Ramesh Kumar issue which has taken many turns so far, is now being examined before the country's highest court. The AP government has filed a special leave petition opposing the continuation of Nimmagadda Ramesh. The petition will be heard in supreme court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X