అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముదురుతున్న పీఆర్సీ వివాదం - సజ్జల మాట తప్పారు : ప్రభుత్వ మీటింగ్..ఉద్యోగ సంఘాల బాయ్ కాట్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ వ్యవహారం ముదురుతోంది. కొంత కాలంగా పీఆర్సీ అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. అయితే, అక్టోబర్ చివరికి పీఆర్సీ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల గత నెలలో హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటి వరకు తమకు కనీసం పీఆర్సీ నివేదిక సైతం ఇవ్వలేదని..వెంటనే ఇవ్వాలని కోరుతూ ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో అయిదున్నార గంటలు నిరీక్షించారు. దీంతో..ప్రభుత్వం ఈ రోజున ఉద్యోగుల సమస్యలపైన చర్చల కోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది.

తొమ్మది ఉద్యోగ సంఘాల బహిష్కరణ

తొమ్మది ఉద్యోగ సంఘాల బహిష్కరణ

ఈ సమావేశానికి 13 ఉద్యోగ సంఘాలను ఆహ్వానించారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే ఏపీజేఎసి, ఏపీజేఎసి అమరావతి సంఘాల నేతలుబాయ్ కాట్ చేసి వచ్చారు. పీఆర్సీ నివేదికను బయట పెట్టాకపోవడo పై సమావేశం నుండి మధ్యలోనే ఉద్యోగ సంఘాలు బాయ్ కాట్ చేసాయి. ప్రభుత్వం పై ఏపీజేఎసి, ఏపీజేఎసి అమరావతి నేతలు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసారు. 13 ఉద్యోగ సంఘాల్లో 9 సంఘాలు ప్రభుత్వం తీరును తప్పు పడుతూ సమావేశం నుంచి బయటకొచ్చామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస రావు చెప్పుకొచ్చారు. పీఆర్సీ, జీతాలు, పెన్షన్ల విషయంలో ప్రభుత్వం వైఖరి సరిగా లేదని విమర్శించారు.

సజ్జల మాట తప్పారంటూ

సజ్జల మాట తప్పారంటూ

పీఆర్సీని గడచిన నెలాఖరులోగా ఇచ్చేస్తామన్న సజ్జల మాటలు ఏమయ్యాయని నిలదీసారు. పీఆర్సీ నివేదిక ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెప్పారు. ఉద్యోగులను ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని ఆరోపించారు. ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు సైతం ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. పీఆర్సీ నివేదిక గురించి ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. మొత్తం నివేదిక కాకుండా ఓ కాగితం మాత్రమే బయటపెట్టడం వెనుకున్న కారణమేంటని నిలదీసారు. ఉద్యోగులకు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏం సమాధానం చెబుతారని అడిగారు.

సీఎం జోక్యం చేసుకోవాలంటూ

సీఎం జోక్యం చేసుకోవాలంటూ


సీఎం స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి కొలిక్కి వచ్చేలా లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల ఒకటో తేదీనే జీతాలివ్వడమే గొప్ప అన్నట్టు ప్రభుత్వం చెబుతోందని వివరించారు. రూ. వేయి కోట్లకు పైగా పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిమిత్తం ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సి వస్తోందన్నారు. కమిటీలతో ప్రభుత్వం కాలాయపన చేస్తోందని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేసారు.

English summary
AP Employee Unions boy cott joint staff counicl meet on protest agsint govt attitude on PRC implementation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X