హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిషిత్‌ మృతి: ఈ ప్రశ్నలకు ‘బెంజ్‌’ రిపోర్ట్‌‌లో జవాబు దొరికేనా?

హైదరాబాద్‌ నగరంలో అత్యంత ఖరీదైన బెంజ్‌‌ కారు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, అతని స్నేహితుడు రవిచంద్ర దుర్మరణం పాలైన ఘటనపై బెంజ్‌ సంస్థ విచారణ చేపట్టింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలో అత్యంత ఖరీదైన బెంజ్‌‌ కారు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, అతని స్నేహితుడు రవిచంద్ర దుర్మరణం పాలైన ఘటనపై బెంజ్‌ సంస్థ విచారణ చేపట్టింది.

జర్మనీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన బెంజ్‌ నిపుణులు.. ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి.. అక్కడ పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన బెంజ్‌ కారును.. బోయిన్‌పల్లిలోని బెంజ్‌ షోరూమ్‌లో పరిశీలించారు.

అతివేగం

అతివేగం

జూబ్లీహిల్స్‌ ప్రధాన రహదారిపై మెట్రో పిల్లర్‌ను బెంజ్ కారుతో వేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌, అతని స్నేహితుడు రవిచంద్ర మరణించారు. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ను నిషిత్‌కు చెందిన బెంజ్‌ ఎఎన్‌జీ - జీ 63 కారు అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ ప్రమాదంపై జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తమ కోణంలో విశ్లేషించారు.

నిషిత్ మరణానికి కారణాలేమిటి? 2 రోజుల్లో నివేదిక నిషిత్ మరణానికి కారణాలేమిటి? 2 రోజుల్లో నివేదిక

 ఈ ఆరు ప్రశ్నలకు సమాధానమేది?

ఈ ఆరు ప్రశ్నలకు సమాధానమేది?

ప్రమాదానికి గల కారణాలపై మెర్సిడెజ్‌ బెంజ్‌ యాజమాన్యానికి పోలీసులు ఆరు ప్రశ్నలతో కూడిన లేఖను రాశారు. అవేమంటే..
1. ఎయిర్‌బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి?
2. నిషిత్‌ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి?
3. మెకానికల్‌ డిఫెక్ట్స్‌ ఉన్నాయా?
4. స్పీడోమీటర్‌ ఎంతవరకు లాక్‌ చేయాలి?
5. ఎంత స్పీడ్‌ ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయి?
6. సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా? పెట్టుకోకున్నా తెరుచుకుంటాయా?

జర్మనీ నుంచి వచ్చి.. నిషిత్ 'డెత్ స్పాట్'ను పరిశీలించిన బెంజ్ ప్రతినిధులు!జర్మనీ నుంచి వచ్చి.. నిషిత్ 'డెత్ స్పాట్'ను పరిశీలించిన బెంజ్ ప్రతినిధులు!

సెక్యూరిటీ ఫీచర్స్ పనిచేయలేదా?

సెక్యూరిటీ ఫీచర్స్ పనిచేయలేదా?

కాగా, హైఎండ్‌ కారు అయిన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు ప్రమాదంలో పలు సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉన్నా.. అవి ఎందుకు వీళ్ల ప్రాణాలు కాపాడలేకపోయాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై మరింత స్పష్టత కావాలంటూ.. మెర్సిడెజ్‌ బెంజ్‌ యాజమాన్యానికి ఆరు ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు.

మోక్షజ్ఞతో సినిమా: అర్ధరాత్రి వరకూ నిశిత్ చర్చలు, బాలయ్య ఫోన్, అంతలోనే..మోక్షజ్ఞతో సినిమా: అర్ధరాత్రి వరకూ నిశిత్ చర్చలు, బాలయ్య ఫోన్, అంతలోనే..

సమాధానం కావాలి...

సమాధానం కావాలి...

ప్రమాదంలో ఎయిర్‌బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి? నిశిత్‌ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి? మెకానికల్‌ డిఫెక్ట్‌నెస్‌ ఉన్నాయా..? స్పీడోమీటర్‌ ఎంతవరకు లాక్‌ చేయాలి? ఎంత స్పీడ్‌ ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయి? సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా...? పెట్టుకోకున్నా తెరుచుకుంటాయా..? అన్న విషయాలు తెలపాల్సిందిగా లేఖలో పోలీసులు కోరారు.

బెంజ్ ప్రతినిధుల విచారణ

బెంజ్ ప్రతినిధుల విచారణ

ఈ క్రమంలోనే పోలీసుల లేఖపై స్పందించిన బెంజ్‌ సంస్థ - ఇద్దరు సీనియర్‌ మెకానికల్‌ ఇంజనీర్లను హైదరాబాద్‌ పంపించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బెంజ్‌ నిపుణులు.. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నప్పటికీ ప్రాణనష్టం ఎలా సంభవించిదన్న కోణంలో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. బోయిన్‌పల్లిలోని బెంజ్‌ షోరూంలో ఉన్న ప్రమాదానికి గురైన కారును కూడా నిశితంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాళ్లిద్దరూ సీట్‌ బెల్టులు ధరించారా..? ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంలో ఆలస్యం ఏమైనా జరిగిందా..? ఆ సమయంలో ఇంజిన్‌ పరిస్థితి, యాంటీ బ్రేకింగ్‌ సిస్టం ఎందుకు ఫెయిలయ్యిందన్న అంశాల గురించి కూడా వారు విశ్లేషించారు.

ఇప్పటి వరకు ప్రాణం నష్టం జరగలేదట

ఇప్పటి వరకు ప్రాణం నష్టం జరగలేదట

ఇప్పటివరకు ఈ మోడల్‌ కార్లు ప్రమాదాలకు గురైనా.. ఎక్కడా ప్రాణనష్టం జరిగిన వివరాలు నమోదు కాలేద బెంజ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు పోవడం వెనుక కారులో తయారీ లోపాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో, పోలీసులు వ్యక్తం చేస్తున్న అనుమానాల కోణంలోనూ బెంజ్‌ ప్రతినిధులు విచారణ సాగిస్తున్నారు. తమ విచారణ పూర్తయ్యాక.. మెర్సిడెస్‌ బెంజ్‌ యాజమాన్యానికి జర్మనీ నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులు నివేదికను అందజేయనున్నారు. యాజమాన్యం అనుమతితో జూబ్లీహిల్స్‌ పోలీసులకు తాము నిర్ధారించిన అంశాల నివేదికను అందించే అవకాశం ఉంది.

అత్యంత శక్తివంతమైన సేఫ్టీ ఫీచర్స్

అత్యంత శక్తివంతమైన సేఫ్టీ ఫీచర్స్

అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ,సేఫ్టీ ఫీచర్స్‌ ఉన్న బెంజ్ కారు ఇది. అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా రక్షణ చర్యలు ఉండే బెంజ్‌ కారు. ఎంతవేగంగా స్పీడ్‌ను అందుకుంటుందో.. అంతే వేగంగా స్పీడ్‌ను కంట్రోల్‌ చేసే వ్యవస్థ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. అందుకే ఇప్పటివరకు ఈ మోడల్స్‌ కారు ప్రమాదాల్లో మరణాలేవీ నమోదుకాలేదంటున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన కారులో ఎలక్ట్రానిక్‌ -గార్డ్స్‌తో కూడిన హైస్టాండర్డ్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉన్నాయి. అనుకోకుండా పేలుడు జరగకుండా.. ఈ వాహనాలకు డిటోనేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ కూడా ఉంది. నాణ్యమైన ఎయిర్‌ బ్యాగ్స్‌ ఫెసిలిటీ ఉంది. అలాగే.. సడెన్‌ బ్రేక్‌ వేసినా అందులో ఉన్న వాళ్లకు ఏమీ కాకుండా.. అక్కడికక్కడే వాహనం ఆగే విధంగా యాంటీ బ్రేకింగ్‌ సిస్టంతో కూడిన బ్రేక్‌ ప్రొటెక్షన్‌ సదుపాయమూ ఉంది. ఇన్ని సేఫ్టీ ఫీచర్లున్నా ఇద్దరు ప్రాణాలు పోవడంపై బెంజ్ నిపుణులు పోలీసులకు సమర్పించే రిపోర్ట్‌పై ఆసక్తి నెలకొని ఉంది.

English summary
Hyderabad police asked 6 questions to Benz delegates on nishit narayana accident death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X