చైనా అమ్మాయితో నిజామాబాద్ అబ్బాయి పెళ్లి
నిజామాబాద్: చైనా అమ్మాయి మింగ్ ల్యాంగ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్బాయి వంశీకృష్ణలు వివాహబంధంతో బుధవారం ఒక్కటయ్యారు. బుధవారం నాజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బంధుమిత్రుల సందడి మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది.

జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురికి చెందిన గంగాధర్, భారతి దంపతుల పెద్ద కొడుకు వంశీకృష్ణ పై చదువుల కోసం ఏడేళ్ల క్రితం చైనా వెళ్లారు. అనంతరం అక్కడే 3జీ నెట్ వర్క్ ఇన్‌ఫర్మేషన్ సంస్థలో ఉద్యోగిగా చేరారు. అదే కంపెనీలో పని చేస్తున్న యువతి మిన్ ల్యాంగ్‌ను ప్రేమించాడు.
మూడేళ్లు వారు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. నిజామాబాదులో భారతీయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రోచ్ఛరణాల మధ్య ఇరువురు ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకకు చైనా నుండి వధువు తల్లిదండ్రులతో పాటు వారి సోదరి మింగ్ పింగ్ జై వచ్చారు.












Click it and Unblock the Notifications