ఏపీ మెడికల్ కాలేజీలపై కేంద్రం అనూహ్య నిర్ణయం
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌పరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది.
వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సైతం సందర్శించారు. ప్రైవేటీకరణ, పీపీపీ విధానానికి మద్దతుగా జనం మద్దుతను కూడగట్టారు. అదే సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది వైఎస్ఆర్సీపీ. ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. సేకరించిన సంతకాలన్నింటినీ గవర్నర్ కు అందజేయనున్నారు జగన్.

ఈ పరిస్థితుల మధ్య కేంద్రం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఇక్కడి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను భారీగా పెంచింది. గైనిక్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటి కంటే అదనంగా 106 సీట్ల మంజూరు చేసింది. వాటిని భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
జగన్ హయాంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని, ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్న అయిదు వైద్య కళాశాలల్లో కొత్తగా వచ్చిన సీట్లు 60 వరకు ఉన్నాయి. ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,763 బ్రాడ్ స్పెషాలిటీ, 4 డిప్లొమా కోర్సు సీట్లు ఉండగా.. వాటి సంఖ్య ఇప్పుడు పెరిగినట్టయింది. 11 కళాశాలలకు కలిపి 106 సీట్లు కొత్తగా మంజూరు అయ్యాయి. జనరల్ మెడిసిన్- 20, గైనకాలజీ- 20, పీడియాట్రిక్-26, ఎనస్థీషియా-12, రేడియాలజీ- 4, ఇతర విభాగాల్లో మరికొన్ని సీట్లను మెడికల్ కమిషన్ కేటాయించింది.
వీటితో పాటు అయిదు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లను పెంచడానికి సంబంధించిన ప్రతిపాదనలనూ ఎన్ఎంసీ ఆమోదించింది. ఫలితంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ- 12, నంద్యాల- 16, రాజమహేంద్రవరం- 16, విజయనగరం- 12, ఏలూరు- 4 సీట్లు పెరిగాయి. గుంటూరు మెడికల్ కళాశాలకు రేడియోలజీ విభాగం- 4, ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్- 4, పీడియాట్రిక్- 4, అనంతపురం- 15, కడప- 7, కర్నూలు -4, శ్రీకాకుళం- 8 సీట్లు అదనంగా లభించాయి.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications