నెం. 1 న్యూస్ ఛానల్‌పై దాడి, విజయవాడలో ఉద్రిక్తత
అమరావతి: విజయవాడ కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తున్న ఓ టీవీ ఛానల్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో టీవీ చానల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది. వివరాల్లోకి వెళితే, నగరంలోని నెంబర్ 1 న్యూస్ ఛానల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు శుక్రవారం రాత్రి రాళ్ల దాడికి దిగారు.

ఈ ఘటనలో కార్యాలయ భవంతిలోని అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనలో సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో టీవీ ఛానల్ యాజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు కొనసాగుతుందని, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications