రైలు వెళ్లిపోయింది: బాబుతో పొత్తుపై కిషన్ రెడ్డి

పొత్తు కోసం తెలుగుదేశం పార్టీయే ప్రయత్నిస్తే అనే ప్రశ్నకు - రైలు వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. మంగళవారంనాడు యూనిటీ ఆఫ్ స్టాట్యూ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కమిటీ చైర్మన్ విద్యాసాగర్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. పొత్తుల ద్వారా గతంలోనూ నష్టపోయామని, రాష్ట్రంలో స్వతంత్రంగా బలపడాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.
బిజెపితో టిడిపి పొత్తుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ముందు సిపిఎంతో పొత్తుగురించి చూసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. విభజన బిల్లుపై అన్ని పార్టీలూ అన్ని ప్రాంతాల మనోభావాలు ప్రతిబింబించేలా నిర్మాణాత్మక చర్చకు రావాలన్నారు. ఎన్ని సంవత్సరాలైనా విడిపోక తప్పదని, తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలుంటే నష్టం ఉండదన్నారు.
కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఇద్దరు స్పీకర్లు ఉండాలని అంటున్నప్పుడు గవర్నర్ ఒకరే ఎందుకుండాలని చెన్నమనేని విద్యాసాగర రావు ప్రశ్నించారు. పటేల్ విగ్రహ ఏర్పాటులో అన్ని పార్టీలవారినీ భాగస్వాములను చేస్తామని చెప్పారు. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవటం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇష్టంలేదని బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications