చంద్రబాబు కమిటీ సూచన: 'ట్యాక్స్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు'
రూ.50 వేలు దాటిన నగదు లావాదేవీల పైన పన్ను విధించే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ గురువారం నాడు చెప్పారు.
న్యూఢిల్లీ: రూ.50 వేలు దాటిన నగదు లావాదేవీల పైన పన్ను విధించే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ గురువారం నాడు చెప్పారు.
ఇటీవలే చంద్రబాబు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ రూ.50,000 దాటిన లావాదేవీల మొత్తంపై పన్ను విధించాలని సూచించింది. దీనిపై శక్తికాంత దాస్ ఈ రోజు మాట్లాడారు. ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.

కమిటీ సిఫార్సులను పూర్తిగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ఒక్కసారిగా తగ్గించడం సాధ్యమయ్యే పనికాదని చెప్పారు.
ఇది అత్యధిక మొత్తంలో ఉండటంతో దీనిని ఏ ఇతర రంగాల నుంచి రాబట్టుకోలేమన్నారు. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ 7 శాతం పైగా వృద్ధిరేటు నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు.












Click it and Unblock the Notifications